Begin typing your search above and press return to search.
ఆర్బీఐ తీరుతో భారత్ ఇక కోలుకోనట్టే..తప్పుపడుతున్న ఆర్థిక సంస్థలు!
By: Tupaki Desk | 2 July 2020 2:30 AMవైరస్ ప్రభావం తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తో పాటు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రం గా ప్రభావితమైంది. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇంకా తీవ్ర ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ పై పడింది. అయితే అన్ లాక్ మొదలవడం తో ఆర్థిక కార్య కలపాలు పునఃప్రారంభమయ్యాయి. తిరిగి పుంజుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రణాళికలు రచిస్తూ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమం లోనే ఆర్బీఐ రుణాల పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేయాలని భావిస్తోంది. దీనిపైనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ (S&P) స్పందించింది. ఈ సందర్భంగా ఓ నివేదిక ఇవ్వగా అది ఆందోళన కలిగించేదిగా ఉంది.
రుణాల పునర్వ్యవస్థీకరణ కేవలం ఎన్పీఏల గుర్తింపును మాత్రమే వాయిదా వేస్తుందని, కానీ సమస్యను పరిష్కరించేదిగా ఉండదని పేర్కొంది. వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా అంచనాలకు మించి రుణదాతలపై ప్రభావం కనిపిస్తోందని, 2019-20లో 8.5 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2020-21 నాటికి 14 శాతానికి పెరుగుతాయని అంచనా వేసింది. వైరస్ వ్యాప్తితో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ గాడీన పడడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉందని S&P అంచనా వేసింది. రుణాల పునర్వ్యవస్థీకరణతో ఎన్పీఏలు గుర్తించడం మాత్రమే వాయిదా పడుతుందని, సమస్య మాత్రం తీరదని స్పష్టం చేసింది.
గతంలో అంచనా వేసిన దాని కంటే బ్యాంకులపై కరోనా ప్రభావం భారీగానే ఉండవచ్చునని.. రుణాల మంజూరు నెమ్మదించి, తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్బీఐ ప్రకటించిన ఈఎంఐ మారటోరియం సదుపాయం ప్రకటించిన అనంతరం ఇప్పుడు ఆర్బీఐ రుణాల పునర్ వ్యవస్థీకరణ వైపు అడుగులు వేస్తోంది.
ఆర్బీఐ రుణాల పునర్వ్యవస్థీకరణ నిర్ణయంతో సమస్య పరిష్కారం కాదని స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్ అండ్ పీ) తెలిపింది. నిరర్థక ఆస్తుల గుర్తింపు మాత్రమే వాయిదా పడుతుందని పేర్కొంది. అలా చేస్తే బ్యాంకులపై వ్యయ భారం పెరుగుతుందని, మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోతుందని.. ఇవి మరింత పెరిగే ఆస్కారం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థలపై (ఎన్బీఎఫ్ సీ) ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. దీంతో రియల్ ఎస్టేట్, టెలికం, విద్యుత్ రంగాల్లో మొండి బకాయిలు పెరగవచ్చునని అంచనా వేసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రుణాల చెల్లింపుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయ పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.40,000 కోట్ల మూలధన సహాయం అవసరం కావొచ్చునని పేర్కొంది. లాక్ డౌన్ ప్రభావంతో ఆర్థిక కార్యకలాపాలకు విఘాతం, ఆర్థిక మాంద్యం వంటి అంశాలు బ్యాంకింగ్ వ్యవస్థపై తీవ్ర, దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయని వెల్లడించింది.