Begin typing your search above and press return to search.

బెంగళూరులో ఉండే వాళ్లకు ఇది బ్యాడ్ న్యూస్

By:  Tupaki Desk   |   5 Jan 2022 4:06 AM GMT
బెంగళూరులో ఉండే వాళ్లకు ఇది బ్యాడ్ న్యూస్
X
డైలీ నైట్ కర్ప్యూ.. వీకెండ్ ఫుల్ కర్ఫ్యూ.. ఆంక్షలతో కూడిన పెళ్లిళ్లు.. మూతపడిన స్కూళ్లు.. కర్ణాటక ప్రభుత్వం విధించిన కరోనా నిబంధలను ఇవి. ఇప్పటి వరకు ఉత్తర భారతంలోనే చూసిన ఆంక్షలు ఇప్పుడు దక్షిణంలో కర్ణాటక ప్రభుత్వం రూల్స్ పెట్టడంతో ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి వస్తుందా..? అనే ఆందోళన నెలకొంది. రోజురోజుకు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తమవుతున్నాయి. గతంతో జరిగిన పెను ముప్పు మరోసారి జరగకుండా ముందే జాగ్రత్తపడుతున్నాయి. ఇందులో ముందుగా కర్ణాటక ముందే డిసిజన్ తీసుకుంది. దీంతో కర్ణాటకతో అనుబంధం ఎక్కువగా ఉన్న తెలుగు ప్రజల్లో ఆందోళన మొదలైంది.

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వెయ్యి లోపు నమోదైన కేసులు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఇందులో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కేసులు ఇలాగే పెరిగితే లాక్డౌన్ కూడా ప్రకటించడానికి రెడీగా ఉన్నట్లు సంకేతాలు పంపుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కేసులు రెండు రోజులుగా విపరీతంగా పెరిగాయి. రోజురోజుకు రెట్టింపు కేసులు నమోదుకావడంతో ఇక్కడి ప్రభుత్వ ఆంక్షలు విధించింది.

రాష్ట్ర రాజధాని బెంగుళూరులో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ ఉంటుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. అలాగే రాబోయే రెండు వారాలు 1 నుంచి 9 తరగతి స్కూళ్లు మూసివేస్తున్నట్లు తెలిపారు. పెళ్లిళ్ల విషయంలో ఔటోడోర్లో 200 మందితో, ఇండోర్లో 100 మందితో మాత్రమే జరుపుకోవాలని సూచించారు. సినిమా హాళ్లు, పబ్ లు, జిమ్ లలోనూ 50 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. 12వ తరగతి విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులు, మిగతా వారికి ఆన్లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. అయితే బస్సులు, మెట్రో, ఇతర రవాణాలపై నిబంధనలు త్వరలో ప్రకటిస్తామనన్నారు. అలాగే నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపింది. అటు దేవాలయాల్లో 50 శాతం మంది మాత్రమే దర్శించుకోవడానికి అనుమతి ఉందని తెలిపింది.

కాగా కర్ణాటకలో కరోనా నిబంధనలు అమల్లోకి రావడంతో ఏపీ, తెలంగాణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది తెలంగాణ, ఏపీ నుంచి బెంగుళూరుకు నిత్యం ప్రయాణం చేసేవారు ఎక్కువే ఉన్నారు. తాజా కరోనా నిబంధనలతో ప్రయాణం చేసేవారికి ఇబ్బందిగా మారనుంది. ఇక వీకెండ్ కర్ఫ్యూతో ఒక రోజు ముందే తమ ప్రాంతాలకు చేరుకోవాల్సి ఉంటుంది. దీంతో తమ ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా బెంగుళూరులో ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఆరు నెలలుగా కర్ణాటకలో 0.1 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఒక్కరోజే 1.6 శాతానికి పెరగడం థర్డ్ వేవ్ కు సంకేతమని అంటున్నారు. ఇన్ఫెక్షన్లు రాష్ట్రంలో 0.4 శాతం నుంచి 1.6 శాతానికి పెరిగాయని, అందులో 90 శాతం బెంగుళూరులోనే ఉన్నాయని మంత్రి సుధాకర్ తెలిపారు. కేసుల కట్టడికి ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే ఇదే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్క్ తప్పనిసరిగా పాటించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ తమ పనులను నిబంధనలను అనుసరించి చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సుధాకర్ హెచ్చరించారు.