Begin typing your search above and press return to search.

బాణాసంచా ప్రియులకు బ్యాడ్ న్యూస్.. క్రాకర్స్ బ్యాన్ చేసిన హైకోర్టు!

By:  Tupaki Desk   |   29 Oct 2021 3:54 PM GMT
బాణాసంచా ప్రియులకు బ్యాడ్ న్యూస్.. క్రాకర్స్ బ్యాన్ చేసిన హైకోర్టు!
X
దీపావళి పండుగ రాబోతుంది. ఇక ఈ పండుగ నాడు ఉదయం పూట ఇళ్లలో లక్ష్మిదేవీ పూజ చేస్తారు. తీపి పదార్థాలు వంటివి చేసుకొని కుటుంబమంతా ఉత్సాహంగా జరుపుకుంటారు. సాయంత్రం వేళలో పిల్లాపెద్దా కలిసి బాణాసంచా కాల్చడం ఆనవాయితీ. అయితే ఈ టపాకాయల వల్ల పర్యవరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని గతకొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాలు తమ అభీష్టం మేరకు క్రాకర్స్ కు అనుమతులు ఇస్తాయి. మరికొన్ని ప్రభుత్వాలు బ్యాన్ చేస్తాయి. అయితే పశ్చిమ బెంగాల్ బాణాసంచా ప్రియులకు మాత్రం ఆ రాష్ట్ర హైకోర్టు షాకిచ్చింది. టపాకాయలు ఎట్టి పరిస్థితుల్లో కాల్చవద్దని సూచించింది. లేదంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

పండుగ సీజన్ కావడంతో... దీపావళి, ఛాత్ పూజ, ఇతర పండుగల సందర్భంగా కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై బ్యాన్ విధించింది. టపాకాయల నిషేధంపై దాఖలైన ఓ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపింది. పండుగల సమయంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ జస్టిస్ సభ్యసాచి భట్టాచార్య, జస్టిస్ అనిరుద్ధ రాయ్ తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎవరైనా అతిక్రమించి టపాకాయలు కాలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. వారి నుంచి బాణాసంచాలను సీజ్ చేసి... చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కరోనా మహమ్మారి నుంచి బయటపడి ఇటీవలే కోలుకుంటున్న రాష్ట్రంలో... బాణాసంచా నిషేధం అవసరమని అభిప్రాయపడింది.

దీపావళి, కాళీ పూజల సందర్భంగా నిర్దేశించిన సమయంలో గ్రీన్ ఫైర్ క్రాకర్స్ కాల్చుకోవచ్చని పశ్చిమ బంగ కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. అందుకు సంబంధించి ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అయితే టపాకాయల నిషేధంపై దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు... క్రాకర్స్ కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దయినట్లేనని తెలుస్తోంది.

ఇకపోతే టపాకాయలు కాల్చడం కొందరికి చాలా సరదా. దీపావళి అంటేనే బాణాసంచా కాల్చడం అని వారి ఉద్దేశం. అయితే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అలాంటి వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కాకపోతే ప్రస్తుత పరిస్థితులు, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు సూచించినట్లుగా అందరూ టపాకాయలకు దూరంగా ఉండడం మంచిది. ఈ దీపావళిని పొల్యూషన్ ఫెస్టివల్ లా కాకుండా లైట్స్ ఆఫ్ ఫెస్టివల్ గా జరుపుకోవచ్చు. అందకే ఇంటిల్లిపాది కలిసి దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటే సరి. లైట్స్ ఆఫ్ ఫెస్టివల్ తో అందరికీ ఆరోగ్యానికి ఆరోగ్యం... ఆనందానికి ఆనందం.