Begin typing your search above and press return to search.

ఆంధ్రోళ్ల ఉసురు ఎఫెక్ట్ మోడీకి మొద‌లైందా?

By:  Tupaki Desk   |   16 March 2018 6:19 AM GMT
ఆంధ్రోళ్ల ఉసురు ఎఫెక్ట్ మోడీకి మొద‌లైందా?
X
గొప్ప‌లు చెప్పుకోవ‌టం కాదు కానీ.. ఆంధ్రోళ్ల‌తో పెట్టుకున్న ఏ ఒక్క‌రూ బాగుప‌డిన దాఖ‌లాలు క‌నిపించ‌వు. ఆంధ్రోళ్ల‌ను అన్యాయం చేసినోళ్లు అంత‌కంతా అనుభ‌వించ‌టం క‌ళ్లారా చూస్తున్న‌దే. ఏపీ విభ‌జ‌న నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత‌.. హ‌డావుడిగా ఇష్టారాజ్యంగా చేసిన విభ‌జ‌న‌పై ఏపీ ప్ర‌జ‌లు ఎంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారో తెలిసిందే.

అయిన‌ప్ప‌టికీ మొండిత‌నంతో విభ‌జ‌న‌ను త‌న‌కు తోచిన రీతిలో చేసేసిన కాంగ్రెస్ కు భారీ శిక్ష ప‌డ‌ట‌మే కాదు.. నాలుగేళ్లు అయినా.. ఇంకా ఆ షాక్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు. అంతేకాదు.. ఏపీ విభ‌జ‌న‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన రాజ‌కీయ నేత‌లంతా ఏదో ర‌కంగా క‌ష్టాల్లో చిక్కుకుపోయిన వారే.

ఇదంతా ఉత్త మాట అనుకుంటే.. తాజాగా ప్ర‌ధాని మోడీ ప‌రిస్థితి చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. ఏపీ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తూ కాలం గ‌డిపేసిన మోడీ.. ఇప్పుడు ఆంధ్రోళ్ల‌కు హ్యాండ్ ఇచ్చే విష‌యంపై క్లారిటీ ఇచ్చిన నాటి నుంచి ఆయ‌న పరిస్థితి మ‌హా ఇబ్బందిక‌రంగా మారిందని చెప్ప‌క త‌ప్ప‌దు. మోడీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్న బాబు బ‌య‌ట‌కు పోవ‌ట‌మే కాదు.. మిత్ర‌ప‌క్షంగా కూడా క‌టీఫ్ చెప్పేశారు.

ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా ఇటీవ‌ల వెలువ‌డిన యూపీ.. బీహార్ ఉప ఎన్నిక‌ల ప‌లితాలు బీజేపీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయ‌ట‌మే కాదు.. మోడీ ప్ర‌భకు మ‌స‌క‌బార‌టం మొద‌లైంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా మోడీకి మ‌రో మిత్ర‌ప‌క్షంగా ఉన్న జేడీయూ అధినేత నితీశ్ సైతం తిరుగుబాటు స్వ‌రం వినిపిస్తున్నారు.

తాజాగా ఆయ‌న బిహార్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌న్న డిమాండ్ ను తిరిగి తెర‌పైకి తీసుకొచ్చారు. త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా డిమాండ్ ను మ‌రోసారి తేవాల‌ని తాము భావిస్తున్న‌ట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి స్ప‌ష్టం చేశారు. గ‌తంలోనే నితీశ్ ఈ డిమాండ్ ను ప్ర‌స్తావించార‌ని.. ఇప్పుడా పోరాటాన్ని మ‌రింత ఉధృతం చేస్తామ‌న్నారు.

ఎన్డీయే ప్ర‌భుత్వంలో మిత్ర‌ప‌క్షంగా ఉన్న జేడీయూ.. ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర మీద‌కు తెస్తే మోడీకి మ‌రో ఇబ్బంది మొద‌లైన‌ట్లే. తాజాగా వెలువ‌డిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ గ్రాఫ్ త‌గ్గింద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో.. ఇదే అద‌నుగా బిహార్ ప్ర‌త్యేక హోదా అంశాన్ని తెర మీద‌కు తీసుకురావ‌టం.. తేడా వ‌స్తే మోడీకి క‌టీఫ్ చెప్పేందుకు సైతం వెనుకాడ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో నితీశ్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. అదే జ‌రిగితే.. మోడీకి బ్యాడ్ టైం మొద‌లైన‌ట్లే.