Begin typing your search above and press return to search.

జనసేన అభ్యర్థి ఖరారు?

By:  Tupaki Desk   |   2 Oct 2021 9:30 AM GMT
జనసేన అభ్యర్థి ఖరారు?
X
ఏపీలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలోకి దిగుతోంది. మిత్రపక్షం బీజేపీ ఈ మేరకు అంగీకరించినట్టు తెలిసింది. ఇప్పటికే బద్వేలులో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంటక సుబ్బయ్య సతీమణి సుధ పోటీలో ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ఓబులాపురం రాజశేఖర్ మరోసారి బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పేరు ఖరారైంది.

ఇక జనసేన-బీజేపీ పొత్తులో ఉండడంతో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థి బద్వేల్ బరిలో ఉంటారో నిన్నటిదాకా తేలలేదు. కడప జిల్లాలో బీజేపీకి బలమైన నేతలుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితోపాటు సీఎం రమేశ్ లాంటి వాళ్లు ఉన్నారు. దీంతో బీజేపీ ఈ సీటుపై కన్నేసిందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా జనసేన ఇక్కడ ట్విస్ట్ ఇచ్చింది. బద్వేలులో బరిలో నిలవాలని జనసేన డిసైడ్ అయ్యింది.

జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయజ్యోతిని బరిలోకి దించనున్నట్టు సమాచారం. విజయజ్యోతి గతంలో బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేశారు. 2014లో  టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు జనసేన నుంచి పార్టీ తరుఫున విజయజ్యోతిని బరిలోకి దింపాలని ఆ పార్టీ యోచిస్తోంది.

ఇప్పటికే జనసేన రాష్ట్ర నాయకులు కొందరు విజయజ్యోతిని జనసేన తరుఫున తరుఫున పోటీచేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారట.. ఈ మేరకు ఆమె తన అనుచరులతో కలిసి చర్చించి ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.

అయితే బీజేపీ మాత్రం ఇప్పటివరకూ జనసేనకే 'బద్వేలు' సీటు అని ప్రకటించలేదు. దీంతో జనసేన ఒంటరిగా బరిలోకి దిగుతుందా? వీళ్లదరి పొత్తు ఉంటుందా? అసలేం జరుగుతుందన్నది ఆసక్తి రేపుతోంది.