Begin typing your search above and press return to search.

సోము వీర్రాజుకు బ‌ద్వేల్ నేర్పిన పాఠం.. ఇక‌నైనా మేల్కొంటారా?

By:  Tupaki Desk   |   27 Oct 2021 5:30 PM GMT
సోము వీర్రాజుకు బ‌ద్వేల్ నేర్పిన పాఠం.. ఇక‌నైనా మేల్కొంటారా?
X
ఏపీ బీజేపీకి బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం ఒక స‌రికొత్త పాఠం నేర్పిందా? పార్టీగా బీజేపీ ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఎలా ముందుకు సాగాలో చెప్పిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. సాక్షాత్తూ .. పార్టీ రాష్ట్ర చీఫ్‌.. సోము వీర్రాజు స్వ‌యంగా చెప్పిన మాట‌లే. ప్ర‌స్తుతం బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ, జ‌న‌సేన‌.. వంటి కీల‌క పార్టీలు పోటీ నుంచి త‌ప్పుకొన్నాయి. అయితే.. త‌గుదున‌మ్మా అంటూ బీజేపీ మా త్రం ఇక్క‌డ నుంచి పోటీ చేస్తోంది. అదేమంటే.. రాజ‌కీయాల్లో వార‌స‌త్వాలు ప్రోత్స‌హించే ప‌రిస్థితి త‌మ కు లేద‌ని.. అందుకే పోటీ చేస్తున్నామ‌ని.. సోము సెల‌విచ్చారు.

ఓకే.. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు క్షేత్ర‌స్థాయిలో బీజేపీ ప‌నిచేయ‌లేద‌నే వాద‌న రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఎవ‌రూ ముందుకు క‌ద‌ల‌డం లేద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో సోము కూడా పెద్ద‌గా క్షేత్ర‌స్థాయిలోకి వెళ్ల‌లేదు. కానీ, బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో అన్ని గ్రామాల్లో నూ ప‌ట్ట‌ణాల్లోనూ కూడా ప‌ర్య‌టించింది. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకుంటోంది. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌ను తెలుసు కుంటోంది. ఈ నేప‌థ్యంలో ఒక చ‌క్క‌ని విష‌యం బీజేపీకి తెలిసివ‌చ్చింద‌ని అంటున్నారు పార్టీ నాయ‌కు లు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో రాజ‌కీయ వ్యాక్యూమ్ ఉంద‌ని.. ప్ర‌జ‌ల‌కు స‌రైన సేవ చేసే వారికోసం ఎదురు చూస్తున్నార‌ని.. వారు తెలుసుకున్నార‌ట‌.

నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ నేత‌లు ఏమ‌నుకున్నారో తెలియ‌దు కానీ.. బ‌ద్వేల్‌లో ప‌ర్య‌ట‌న త‌ర్వాత‌.. మాత్రం.. బీజేపీ నేత‌లకు ఈ విష‌యం తెలిసింద‌ని .. అంటున్నారు. ఇదే విష‌యాన్ని సోము వీర్రాజు కూడా.. స్వ‌యంగా చెప్పుకొచ్చారు. బ‌ద్వేల్‌లో ప్ర‌తి గ్రామంలోనూ తాము ప‌ర్య‌టిస్తున్నామ‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లుతెలుసుకుంటున్నామ‌ని.. అనేక స‌మ‌స్య‌లు ఉన్న విష‌యాన్ని గుర్తించామ‌ని సోము చెబుతున్నారు. సో.. మొత్తానికి బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ పెద్ద లెస్స‌నే గ్ర‌హించింది. ప్ర‌జ‌ల‌కు స‌రైన విధంగా సేవ చేసే వాళ్లు కావాల‌నే విష‌యాన్ని.. పార్టీ నేత‌లు గుర్తించారు. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు ఆదిశ‌గా అడుగులువేస్తే.. బీజేపీకి మంచి రోజులు వ‌చ్చిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.