Begin typing your search above and press return to search.
బద్వేల్ బీజేపీకి యంగ్ డైనమిక్ సురేష్... ?
By: Tupaki Desk | 6 Oct 2021 8:50 AM GMTఏపీలో బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల సెగ గట్టిగానే రాజుకునేలా ఉంది. బద్వేల్ లో గెలుపు విషయంలో ఒక క్లారిటీ ఉంది. వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు, వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ నిలబెడుతున్నది ఆయన సతీమణి సుధను. దాంతో వైసీపీ ఎన్నికల లాంచనప్రాయం. నిజానికి ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావాలి. టీడీపీ జనసేన తప్పుకున్నాక అదే జరుగుతుంది అని అంతా అనుకున్నారు. కానీ చిత్రంగా కాంగ్రెస్ బీజేపీ తొడ కొడుతున్నాయి. మేము రంగంలో ఉంటామని అంటున్నారు. కాంగ్రెస్ కి అక్కడ గెలిచిన చరిత్ర ఉంది. దాంతో మాజీ ఎమ్మెల్యే కమలమ్మను తెచ్చి అభ్యర్ధిని చేశారు.
బీజేపీ విషయానికి వస్తే ఎపుడూ గట్టిగా రెండు వేల ఓట్లు రాలేదు. మరి ఎందుకు పోటీ పెడుతున్నారు అంటే వారిలో కొత్త ఆశలు ఉన్నాయని అంటున్నారు. వైసీపీ మీద వ్యతిరేకత ఏమైనా ఉంటే టీడీపీ పోటీలో ఉండదు కాబట్టి తమకు అది కలసివస్తుంది అన్నదే వారి లాజిక్. అంతే కాకుండా మిత్ర పక్షం జనసేనను ఎలాగోలా ఒప్పించుకుని ప్రచారం చేసుకుంటే గౌరవప్రదమైన ఓట్లు వస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో అభ్యర్ధి కోసం వేటాడితే పనతాల సురేష్ పేరు బయటకు వచ్చిందట.
బీజేపీ జాతీయ నాయకత్వానికి అయిదు పేర్లను పంపిస్తే అందులో సురేష్ పేరునే వారు దాదాపుగా సెలెక్ట్ చేసెసారు అంటున్నారు. సురేష్ ఏబీవీపీ విద్యార్ధి నాయకుడిగా కీలకమైన పదవులు నిర్వహించారు. జాతీయ విద్యార్ధి విభాగంలో కూడా చురుకుగా పనిచేసిన చరిత్ర ఉంది. అంతకంటే ముఖ్య విషయం ఏంటి అంటే ఆయన ఆరెస్సెస్ పెద్దలతో కూడా మంచి పరిచయాలు ఉన్న నేత. దాంతో ఈ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ని తెచ్చి బీజేపీ పోటీకి పెడుతోంది అంటున్నారు.
ఇప్పటికే ఇద్దరు అతివలు పోటీలో ఉన్నట్లు అయింది. వారితో సురేష్ పోటీ పడడం అంటే ఆసక్తికరమే. ఇందులో అనుభవం దృష్ట్యా చూస్తే కాంగ్రెస్ అభ్యర్ధి ముందుంటారు. ఇక రాజకీయంగా చూసుకుంటే సురేష్ కనిపిస్తారు. భర్త మరణం తరువాతనే రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ సుధకు వైసీపీయే అతి పెద్ద ఆలంబన. ఆమె గెలుపు విషయంలో డౌట్లు లేకపోయినా కాంగ్రెస్, బీజేపీ మాత్రం గట్టి అభ్యర్ధులనే పోటీకి పెట్టడంతో బద్వేల్ ఉప ఎన్నిక కొంత ఆసక్తిని కలిగిస్తోంది అని చెప్పాలి. సురేష్ పేరుని ఖరార్ చేసి ప్రచారం పరుగులు పెట్టించాలని బీజేపీ భావిస్తోంది అంటున్నారు.