Begin typing your search above and press return to search.
బాగ్దాదీ ఆపరేషన్ వీడియో బయటకొచ్చింది
By: Tupaki Desk | 31 Oct 2019 5:05 AM GMTతన తీవ్రమైన చేష్టలతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేయటమే కాదు.. ఐసిస్ కన్ను తమ దేశం మీద పడకూడదని ఫీలైన దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటివారందరికి తాత్కాలిక రిలీఫ్ ఇస్తూ.. ఆ సంస్థ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని ఇటీవల ఒక ఆపరేషన్ చేసిన మరీ హతమార్చటం తెలిసిందే. అమెరికన్ బలగాలు తన నివాసాన్ని చుట్టి ముట్టిన వేళ.. ఆత్మాహుతి దాడికి పాల్పడటం ద్వారా మరణించిన బాగ్దాదీ ఎపిసోడ్ వివరాల్ని వెల్లడించింది అగ్రరాజ్యం.
తాజాగా తాము చేసిన ఆపరేషన్ కు సంబంధించిన ఫోటోల్ని.. వీడియోల్ని పెంటగాన్ విడుదల చేసింది. ఈ వీడియోలలో అమెరికా ప్రత్యేక బలగాలు నెమ్మదిగా బాగ్దదీ ఉన్న ఇంటిని చుట్టుముడుతున్న వైనంతో పాటు.. అమెరికా బలగాలు కిందకు దిగేందుకు ముందు చేసిన దాడులకు సంబంధించిన వీడియోలు విడుదలయ్యాయి.
బాగ్దాదీని మట్టుపెట్టిన తర్వాత అతడి నివాసాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన వైనాన్ని వెల్లడించారు. ఇక.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నట్లు బాగ్దాదీ తనను తాను పేల్చేసుకునే వేళలో తన ముగ్గురు పిల్లల్ని చంపేయలేదని.. ఇద్దరు మాత్రం మరణించారని పేర్కొన్నారు. చనిపోయిన వారిద్దరి వయసు 12 ఏళ్ల లోపేనని చెబుతున్నారు. తొలుత తన ఇద్దరు పిల్లల్ని దాచుకొని.. కాల్పులకు తెగబడ్డాడని.. ఆ తర్వాత దిక్కుతోచని స్థితిలో తనను తాను పేల్చేసుకున్నట్లు చెప్పారు.
బాగ్దాదీ మరణించిన సమయంలో కాంపౌండ్ లో మరో నలుగురు మహిళలు.. ఒక పురుషుడు కూడా మరణించినట్లు చెబుతున్నారు. బాగ్దాదీ ఇంటిని అమెరికా దళాలు టార్గెట్ చేసిన సమయంలో తీవ్రవాదులు హెలికాఫ్టర్ మీద దాడులకు తెగబడటంతో వారి మీద కూడా దాడి చేసినట్లు చెప్పారు. అయితే..ఈ దాడిలో ఎంతమంది మరణించారన్న లెక్క తేలలేదు. ఇదిలా ఉంటే.. బాగ్దాదీని లేపేసే ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను విడుదల చేయటంతో అందరూ దాన్ని ఆసక్తికరంగా వీక్షిస్తున్నారు.
Video >>> https://twitter.com/DeptofDefense/status/1189708515495096320?s=20