Begin typing your search above and press return to search.

మాజీ సీఎంలకు ఆయనే ఆదర్శం

By:  Tupaki Desk   |   2 Aug 2015 10:17 AM IST
మాజీ సీఎంలకు ఆయనే ఆదర్శం
X
పదవిలో ఉన్నప్పుడు చక్రం తిప్పే నేతలు.. పదవి చేజారిన తర్వాత చక్రం తిప్పే అవకాశం లేకున్నా.. ప్రభుత్వం కల్పించే సౌకర్యాల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని కోరుకుంటార. ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు సరిపోక.. మరిన్ని కావాలని కోరుకోవటం ఈ మధ్యన చూస్తున్నాం. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ..తనకు కల్పించే కారు వసతి విషయంలో ఆమె.. కక్కుర్తి ప్రదర్శించటం తెలిసిందే.

ఇలాంటి నేతలతో పాటు.. అదర్శాలు.. సిద్ధాంతాలతో మరింత మందికి స్ఫూర్తినిచ్చే నేతలు కాస్తంత అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ నిలుస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో తనకు నివాసం తప్ప.. మిగిలిన సౌకర్యాలను తాను వదులుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రులకు సెక్యూరిటీ.. కారు లాంటి సౌకర్యాలు తీసేయాలంటూ 1997లో చట్టం చేసినా.. దాన్ని అమలు చేసే పాపానికి పోవటం లేదు.

ఈ విషయంలో తాము చట్టాన్ని కచ్ఛితంగా అమలు చేస్తామంటూ ఉత్తరాఖండ్ సర్కారు తేల్చి చెప్పిన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ స్పందించారు. తనకు ఇల్లు తప్పించి.. మరెలాంటి సౌకర్యం అక్కర్లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆయన మాదిరే మిగిలిన మాజీ ముఖ్యమంత్రులు వ్యవహరిస్తే కాస్తంత హుందాగా ఉంటుంది. ఊరికే వచ్చే ప్రభుత్వ వసతుల్ని వదులుకోవాలన్నా.. కొంతమందికి బాధే.