Begin typing your search above and press return to search.

ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు.. కానీ, ఒక్క షరతు , ఏంటంటే ?

By:  Tupaki Desk   |   24 May 2021 7:30 AM GMT
ధూళిపాళ్ల నరేంద్రకు బెయిల్ మంజూరు.. కానీ, ఒక్క షరతు , ఏంటంటే ?
X
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టు లో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయన తో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ ఇచ్చింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ధూళిపాళ్ల నరేంద్రను ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పూచీకత్తు తో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల పాటు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో ఉండాలని ధూళిపాళ్లను కోర్టు సూచించింది.

సంగం డెయిరీ లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగియంటూ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ పై గత నెల 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నరేంద్రతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల్‌ కృష్ణన్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు, ఈరోజు వారికి బెయిల్‌ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని, నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణాధికారికి ఇవ్వాలని ఉన్నత హైకోర్టు సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణాధికారి నోటీసు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ధూళిపాళ్ల నరేంద్ర జైలలో ఉండగానే కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఆదేశాలు జైలుకు అందిన తర్వాత ధూళిపాళ్ల విడుదల కానున్నారు. ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబి అధికారులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120బీ, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.సీఆర్పీసీ సెక్షన్ 50(2) కింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.