Begin typing your search above and press return to search.
ముద్రగడ దీక్ష ముగించటమే మిగిలింది
By: Tupaki Desk | 20 Jun 2016 4:24 PM GMTకాపు నేత.. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాను అనుకున్నది సాధించుకున్నారు. తుని విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 13 మందిని విడుదల చేసి.. తన ముందుకు తీసుకొస్తే కానీ దీక్ష విరమించనంటూ పంతం పట్టుకొని కూర్చోవటం తెలిసిందే. గడిచిన 13 రోజులుగా దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్ష విషయంలో వెనక్కి తగ్గలేదు. మొండోడు రాజు కంటే బలవంతుడన్న చందంగా.. భారీ కోరికను ఏపీ సర్కారు ముందు పెట్టి తనకు తగ్గట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా చేయటం గమనార్హం.
శుక్రవారం 10 మందికి బెయిల్ వచ్చినా.. ఎనిమిది మంది మాత్రమే విడుదల కావటం.. సాంకేతిక కారణాలతో మరో ఇద్దరిని విడుదల చేయలేదు. తాను మొదటి నుంచి చెప్పినట్లుగా అరెస్ట్ చేసిన 13 మందికి బెయిల్ మంజూరు చేసి.. వారిని తన ముందుకు తీసుకు వస్తేనే.. తాను దీక్ష విరమిస్తానని మొండికేసి కూర్చున్నారు ముద్రగడ. దీంతో.. ఆయన మాటకు ఓకే అనక తప్పలేదు. తాజాగా ముద్రగడ కోరుకున్నట్లే మిగిలిన వారికి కూడా బెయిల్ మంజూరయ్యాయి. దీంతో.. 13 మందికి బెయిల్ వచ్చేసినట్లే. దీంతో.. ముద్రగడ ఈ రోజు దీక్ష ముగించే వీలుందన్న మాటను చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు సంభవిస్తే రేపు దీక్ష విరమిస్తారని.. లేని పక్షంలో ఈ రోజు (సోమవారం) రాత్రే దీక్ష విరమించే వీలుందని చెబుతున్నారు.