Begin typing your search above and press return to search.
రెండు లగ్జరీ ఫ్లాట్లు కొన్న బజాజ్ ఫ్యామిలీ.. ధర ఎంతంటే?
By: Tupaki Desk | 7 May 2022 4:29 AM GMTదేశంలోని అగ్రగామి వ్యాపార.. పారిశ్రామిక కుటుంబాల్లో మంచి పేరున్న కుటుంబం బజాజ్. వీరి ఉత్పత్తుల నాణ్యత విషయంలో మంచి పేరుంది. కాలానికి తగ్గట్లుగా మార్పు చెందే విషయంలో.. కొన్ని వ్యాపార కుటుంబాలు కాస్తంత వెనకబడి ఉంటాయి. ఆ కోవలోకే వస్తుంది బజాజ్ ఫ్యామిలీ.
ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఈ గ్రూపులోని ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు తాజాగా ముంబయిలో కొనుగోలు చేసిన రెండు ఖరీదైన ప్లాట్లు ఇప్పుడు వ్యాపార వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
డబ్బుకు కొదవలేని పారిశ్రామిక కుటుంబాలు విలాసవంతమైన విల్లాలు.. లేదంటే ఖరీదైన బంగ్లాలు కొనుగోలు చేస్తాయి. అందుకు భిన్నంగా ఒక అపార్ట్ మెంట్లో లగ్జరీ ప్లాట్ ను కొనుగోలు చేయటం గమనార్హం. గత నెలలో జరిగిన ఈ డీల్ విషయం తాజాగా బయటకు వచ్చింది. ముంబయిలో అత్యత ఖరీదైన ప్రాంతంగా పేర్కొనే కార్మికైల్ రెసిడెన్సీలోని ఈ రెండు ఫ్లాట్లు ఉన్నాయి.
దీన్లో ఒక దానిని బజాజ్ ఎలక్ట్రికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ బజాజ్ కుటుంబ సభ్యుల పేరుతో నమోదయ్యాయి. ఒక ప్లాట్ ను శేఖర్ బజాజ్ సతీమణి కిరణ్ బజాజ్ కొనుగోలు చేశారు.
సదరు అపార్ట్ మెంట్ లోని ఎనిమిదో అంతస్తులో 3183 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ప్లాట్ ఉంది. దీని కోసం రూ.47 కోట్లను ఖర్చు చేశారు. ఈ డీల్ కోసం రూ.2.82 కోట్ల స్టాంప్ డ్యూటీని చెల్లించారు.
శేఖర్ బజాజ్ కోడలు పూజ బజాజ్ సైతం ఇదే అపార్ట్ మెంట్లోని ఎనిమిదో అంతస్తులో మరో ప్లాట్ కొన్నారు. దాని ధర రూ.50 కోట్లుగా చెబుతున్నారు. మొత్తంగా బజాజ్ కుటుంబ సభ్యులు రూ.97 కోట్లు ఖర్చు చేసిన రెండు ప్లాట్లు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి. ఇన్నేసి కోట్లు పెట్టి కొన్న ప్లాట్లు మరెంత విలాసవంతంగా ఉంటాయో?