Begin typing your search above and press return to search.

లవ్ జిహాద్ కి పోటీ ఎత్తు మొదలైంది

By:  Tupaki Desk   |   21 July 2015 3:43 PM GMT
లవ్ జిహాద్ కి పోటీ ఎత్తు మొదలైంది
X
హిందువుల అమ్మాయిల్ని ఇతర మతస్తులు(ముఖ్యంగా ముస్లింలు) వ్యూహాత్మకంగా ముగ్గులోకి దింపుతున్నారని.. కొందరు మోసం చేస్తుంటే.. మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని వారి మతం మార్చేస్తున్నారని ఆరోపిస్తూ.. దానికి లవ్ జిహాద్ అని పేరు పెట్టి హిందుత్వ సంస్థలు ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే.

హిందువుల అమ్మాయిల్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన లవ్ జిహాదీకి పోటీగా.. బహు లావో.. బేటీ బచావో అంటూ సరికొత్త నినాదాన్ని షురూ చేసింది భజరంగ్ దళ్. ఉత్తగా ఆ మాట చెప్పటమే కాదు.. ఉత్తర భారతదేశంలోని పలు స్కూళ్లకు పెళ్లి ఈ నినాదాన్ని కరపత్రాల రూపంలో పంచి పెడుతున్నారు.

ఈ నినాదంలో భాగంగా మతం ఏదైనా సరే.. ఆ అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని కోడళ్లుగా తెచ్చుకోవాలని.. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు పేర్కొన్నారు. లవ్ జిహాద్ కు పోటీగా ఈ ప్రచారం చేపట్టామని వారు చెబుతున్నారు. మరి.. ఈ తాజా ప్రకటన దేశంలో మరెంత సంచలనం సృష్టిస్తుందో చూడాలి.