Begin typing your search above and press return to search.
భజరంగ్ దళ్ కు బలైన యువ జంట
By: Tupaki Desk | 14 Feb 2019 2:43 PM GMTవాలంటైన్స్ డేను భజరంగదళ్ కార్యకర్తల్ని విడదీసి చూడలేం. ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు, అన్ని పార్కులు జల్లెడ పట్టడం కనిపించిన ప్రేమ జంటకు పెళ్లిళ్లు చేయడం ప్రతి ఏటా జరిగే తంతే. ఈ ఏడాది కూడా ఓ ప్రేమ జంట, భజరంగదళ్ అత్యుత్సాహానికి బలైంది.
హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ లో ఉన్న కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ లో తమకు ఎదురైన ప్రేమ జంటను పట్టుకున్నారు భజరంగదళ్ కార్యకర్తలు. మంగళసూత్రం లాంటిది ఒకటిచ్చి వాళ్లకు బలవంతంగా పెళ్లిచేశారు. పెళ్లి తతంగాన్ని సెల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా వదిలారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. దగ్గర్లోని కాలేజీలో చదువు పూర్తిచేసుకున్న ఆ ప్రేమజంట నిజంగానే పెళ్లి చేసుకోవాలని భావించిందట. కాకపోతే వాళ్ల పెళ్లికి ఇంట్లో పెద్దలు అంగీకరించడం లేదట. సరిగ్గా అదే సమయంలో భజరంగదళ్ కార్యకర్తలు వీళ్లికి పెళ్లిచేశారు.
మరోవైపు ఏపీ, తెలంగాణలోని పలు పట్టణాల్లో భజరంగదళ్ కార్యకర్తలు హంగామా చేశారు. ఎల్బీ నగర్ సర్కిల్ లో వాలంటైన్ దిష్టిబొమ్మను దగ్దం చేయడానికి ప్రయత్నించిన కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.