Begin typing your search above and press return to search.
టోక్యో ఒలింపిక్స్ : కాంస్యం గెలిచిన బజరంగ్ పునియా !
By: Tupaki Desk | 7 Aug 2021 12:39 PM GMTపథకమే లక్ష్యంగా టోక్యో ఒలంపిక్స్ బరిలో నిలిచిన భజరంగ్ పూనియా చివరికి తను అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించాడు. అనుకున్నట్లే మెడల్ ఫెవరేట్ భజరంగ్ పూనియా పతకం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్ 65 కేజీల ఫ్రీస్టైల్ లో భజరంగ్ బ్రాంజ్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. కాంస్య పతకం కోసం సాగిన మ్యాచ్ లో భజరంగ్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి 8-0 తేడాతో మెడల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రాంజ్ మెడల్ కోసం జరిగిన మ్యాచ్ లో కజకస్తాన్ కు చెందిన దౌలత్ నియాజ్ బెకోవ్ తో ఇండియన్ స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా బరిలో నిలిచి గెలిచాడు.
ఫస్ట్ పీరియడ్‌లో భజరంగ్ మొదట ఓ పాయింట్ సాధించాడు. రెండుసార్లు వరల్డ్ చాంపియన్ షిప్ లో మెడల్ కొట్టిన దౌలత్.. ఈ మ్యాచ్ లో భజరంగ్ కు గట్టి పోటీ ఇచ్చాడు. చాలా టైట్ గా ఇద్దరూ కుస్తీపడ్డారు. ఫస్ట్ పీరియడ్ ముగింపులో మరో పాయింట్ ను భజరంగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆ పీరియడ్ లోకి అతనికి 2-0 లీడ్ వచ్చింది. సెకండ్ పీరియడ్ కూడా రసవత్తరంగా సాగింది. అయితే ఆ పీరియడ్ ఆరంభంలోనే భజరంగ్ రెండు పాయింట్లు సాధించాడు.
ఆ తర్వాత వరుసగా రెండేసి పాయింట్లను రెండు సార్లు సాధించిన పూర్తి ఆధిపత్యాన్ని నెలకొల్పాడు. ఆ పీరియడ్ లో ఆరు పాయింట్లు గెలిచాడు. మొత్తంగా పురుషుల 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజ్‌రంగ్ పునియా కాంస్య పతకం గెలిచాడు. కాంస్య పతకం కోసం జరిగిన కుస్తీ పోటీలో..కజక్‌స్థాన్ రెజ్లర్ దౌలత్ నియత్‌బెకోవ్‌ను 0-8 తేడాతో చిత్తుగా ఓడించాడు. భజరంగ్ విక్టరీతో భారత్ ఖాతాలో ఆరు పతకాలు చేరాయి. దీంట్లో రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. 57 కేజీల విభాగంలో పోటీపడిన రెజ్లర్ రవి కుమార్ దహియా ఇప్పటికే రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే.