Begin typing your search above and press return to search.
టీడీపీకి బిగ్ షాక్... లోకేశ్ తోడల్లుడి ఆస్తులు జప్తు!?
By: Tupaki Desk | 16 Oct 2019 7:39 PM GMTమొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓటమిపాలైన తెలుగు దేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తోడల్లుడు, పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో అల్లుడు, మొన్నటి ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన శ్రీభరత్ కు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఆంద్రా బ్యాంకు జప్తు చేసింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ జప్తు వ్యవహారం కాస్తంత ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ జప్తు వ్యవహారంతో మరోమారు టీడీపీ పరువు గంగలో కలిసిందన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం పూర్తి వివరాల్లోకి వెళితే... శ్రీ భరత్ తాత, టీడీపీ దివంగత నేత, ఎంపీగానే కాకుండా ఎమ్మెల్సీగానూ వ్యవహరించిన ఎంవీవీఎస్ మూర్తి గతంలో వీబీసీ రిన్యూవేబిల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఓ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ ద్వారానే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికంటూ రూ.13.64 కోట్ల మేర రుణానికి సంస్థ డైరెక్టర్ హోదాలో శ్రీభరత్ బృందం ఆంధ్రాబ్యాంకుకు దరఖాస్తు చేసుకుంది. రుణం మంజూరు కోసం విజయనగరం జిల్లా నెలిమర్ల మండల పరిధిలో వీబీసీ రిన్యూవేబిల్ కంపెనీకి ఉన్న భూములను తనఖా పెట్టారు. ఎలాగూ భూములు తనఖా పెట్టిన నేపథ్యంలో ఆంధ్రా బ్యాంకు కూడా రుణం మంజూరు చేసింది. రుణం తీసుకున్న శ్రీభరత్... రుణ వాయిదాలు చెల్లించడం మానేశారు.
ఈ క్రమంలో రుణాన్ని చెల్లించాలంటూ ఆంధ్రా బ్యాంకు అధికారులు శ్రీ భరత్ కు ఇప్పటికే పలుమార్లు విజ్ఝప్తి చేశారు. అయినా శ్రీభరత్ నుంచి స్పందన లేకపోవడంతో నోటీసులు జారీ చేస్తూ వచ్చారు. అప్పటికీ శ్రీభరత్ స్పందించకపోవడంతో జూలై 8న ఆంధ్రా బ్యాంకు అధికారులు శ్రీభరత్ కు డిమాండ్ నోటీసు జారీ చేశారు. ఈ నోటీసుకు కూడా శ్రీభరత్ నుంచి స్పందన లేకపోవడంతో ఈ నెల 10,11 తేదీల్లో శ్రీభరత్ బృందం తనఖా పెట్టిన ఆస్తులను జప్తు చేస్తూ ఆంధ్రా బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు రోజుల క్రితమే చోటుచేసుకున్న ఈ జప్తు ఘటనకు సంబంధించిన వ్యవహారం అసలు బయటకు పొక్కలేదు. అయితే బుధవారం ఈ తతంగం మొత్తం బయటపడిపోయింది.
ఇదిలా ఉంటే... బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని తిరిగి చెల్లించని అపకీర్తిని మూటగట్టుకున్న వీబీసీ రిన్యూవేబిల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎంవీవీఎస్ మూర్తే ప్రారభించినా... దాని వ్యవహారాలన్నీ కూడా శ్రీభరత్ బృందమే చూస్తోందట. ఈ కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉన్న శ్రీభరత్... బాలకృష్ణ కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా చేర్చేశారట. ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన ఆస్తులను ఆంద్రా బ్యాంకు జప్తు చేయడంతో శ్రీభరత్ తో పాటు బాలయ్య కుమార్తె కూడా వార్తల్లోకెక్కక తప్పలేదు. ఇప్పటికే ఓటమి, పార్టీ నేతలు వరుసగా ఇతర పార్టీల్లోకి చేరిపోతుండటం... తదితర పరిణామాల నేపథ్యంలో శ్రీభరత్ ఆస్తుల జప్తుతో టీడీపీ పరువు మరింత దిగజారిపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.