Begin typing your search above and press return to search.
పిచ్చిపీక్స్... తిలక్ ఫాదర్ ఆఫ్ టెర్రరిజమ్!
By: Tupaki Desk | 11 May 2018 4:31 PM GMTవివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ తరుచూ వార్తల్లో నిలిచే రాజస్తాన్ విద్యాశాఖ మరో వివాదానికి తెరతీసింది. రాజస్తాన్ విద్యాశాఖ గతంలోనూ.. గాంధీ - నెహ్రూలను విస్మరించి వి.డి.సావర్కర్ ను జాతీయవాదిగా చిత్రీకరించారు. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాల్లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగిస్తూ రాజస్థాన్ విద్యాశాఖ అధికారులు గత ఏడాది సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠ్య పుస్తకాల పునఃసమీక్షలో భాగంగా ఆయనకు సంబంధించిన రెండు పాఠ్యాంశాలను తొలగిస్తున్నట్టు రాజస్థాన్ మాధ్యమిక విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త పాఠ్యాంశాలకు సంబంధించిన వివరాలను రాజస్థాన్ స్టేట్ టెక్ట్స్‌బుక్ బోర్డు తన వెబ్ సైట్ లో పొందుపర్చింది. ఈ మార్చు వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలులోకి రానుంది. ఇప్పుడు అదేశాఖ స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాదర్ తిలక్ ను ఉగ్రవాదితో పోల్చింది.
ఎనిమిదో తరగతి విద్యార్థుల సాంఘీక పుస్తకంలోని పాఠ్యంశంలో 'పద్దెనిమిది - పంతొమ్మిదో శతాబ్దంలో జాతీయ ఉద్యమ సంఘటనలు' అనే అధ్యాయంలో ఈ వాక్యాలను ప్రచురించారు. అందులో.. 'జాతీయ ఉద్యమం కోసం తిలక్ అందరు నడిచిన బాటలో కాకుండా వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకే ఆయన ఉగ్రవాదానికి మూలపురుషుడు' అంటూ ప్రచురించింది. దీనిపై అజ్మీర్ లోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ ను వివరణ కోరగా.. ఈ విషయం గురించి తనకు తెలియదని, ఈ మధ్యే బాధ్యతలు తీసుకున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై చరిత్రకారులు తీవ్రంగా మండిపడుతున్నారు. తిలక్.. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని.. గొప్ప జాతీయవాదిని ఇలా అవమానించడం బాధాకరమన్నారు.