Begin typing your search above and press return to search.
ఉద్ధవ్ ఉత్సవ విగ్రహం... బాలా సాహెబ్ కే సలాం
By: Tupaki Desk | 21 Jun 2022 2:47 PM GMTశివసేనకు ప్రాణ ప్రతిష్ట చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పిన బాల్ థాక్రే మరణించి దశాబ్దం దగ్గర అవుతోంది. శివసేన లోని పులి నాటి నుంచి పౌరుషం తగ్గించుకునే ఉందని అసలైన శివసైనికులు అంటారు. బాల సాహెబ్ కి ధీటైన వారసుడు రాజ్ థాక్రే ని పొగ పెట్టేసి పంపారు. ఉద్ధవ్ థాక్రేని బొమ్మగా నిలబెట్టి వెనక నుంచి కధ నడిపే వారు ఆ పార్టీలో ఉన్నారు.
అలా పేరుకు సీఎం గా ఉన్న ఉద్ధవ్ థాక్రే బాల సాహెబ్ సిద్ధాంతాలను మంటగలుపుతున్నారని ఆ పార్టీలో చాలా కాలంగా చర్చ సాగుతోంది. ఇపుడు సీనియర్ నేత, రెబెల్ మినిష్టర్ ఏక్ నాధ్ షిండే తిరుగుబాటు ద్వారా అదే నిజమని చెప్పేశారు. ఆయన శివసేనను నిలువునా చీల్చేసి కొంతమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచే ఆయన చేసిన ఒక ట్వీట్ సీఎం ఉద్ధవ్ థాక్రే గాలి తీసేసింది.
మాకు హిందూత్వ గురించి నేర్పించింది బాల్ థాక్రే. ఆయన అనుచరులను, ఆయన సైనికులం, మేము అధికారం కోసం ఎన్నడూ మోసానికి పాల్పడమని ఏక్ నాధ్ షిండే చేసిన కామెంట్స్ శివసేనలో నిజంగా మంటలు పుట్టించేవే. అంతే కాదు బాల్ థాక్రే కుమారుడిగా శివసేన పగ్గాలు పట్టి అధికారాన్ని అందుకున్న ఉద్ధవ్ థాక్రేకి ఇవి ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి అంటున్నారు.
ఇక ఏక్ నాధ్ షిండే తన ట్వీట్ బయోలో శివసేన అన్న పదాన్ని తొలగించడం కూడా చర్చనీయంశంగా ఉంది. బాల సాహెబ్ సైనికులం అంటే ఉద్ధవ్ థాక్రేకు కాదని ఏక్ నాధ్ చెప్పారని అంటున్నారు. అంతే కాదు ఉద్ధవ్ అధికారం కోసం మోసానికి పాల్పడ్డారని అర్ధం వచ్చేలా విమర్శించారు అని విశ్లేషిస్తున్నారు. ఇక తాము అసలైన శివ సైనికులమని కూడా చెప్పుకునే ప్రయత్నం చేశారు అంటున్నారు.
నిజానికి శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే జీవితకాలం వ్యతిరేకించిన కాంగ్రెస్ తో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయినపుడే ఉద్ధవ్ థాక్రే తన అస్థిత్వాన్ని పార్టీ అస్థిత్వాన్ని కోల్పోయేలా చేశారని అంటారు. ఇపుడు బలమైన నేతగా ఏక్ నాధ్ షిండే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సవాల్ చేస్తున్నారు. అదే టైమ్ లో శివసేనలో పక్కా మాస్ లీడర్ గా గుర్తింపు పొందారు.
ఆయన థాక్రే కుటుంబానికి నమ్మిన బంటుగా మంత్రిగా నిన్నటిదాకా ఉంటూ వచ్చారు. అయితే ఇపుడు మా ఆరాధ్య దేవుడు బాలా సాహెబ్ అని కలవరిస్తూ ఉద్ధవ్ థాక్రే కుర్చీ కిందకు నీళ్ళు తెచ్చేలా చేశారు అని అంటున్నారు. ఇప్పటికి నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన ఏక్ నాధ్ షిండే శివసేనలో పవర్ ఫుల్ లీడర్. ఆయన కొడుకు కూడా సిట్టింగ్ ఎంపీ.
ఆయన ఇపుడు శివసేనలో రేపిన అలజడి అంతా ఇంతా కాదు, ఆయన కొత్త దారి చూపించడంతో శివసేనలో ఉన్న అసమ్మతి అంతా అటు వైపుగా సాగుతోంది అని కూడా అంటున్నారు. ఏరి కోరి పది ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పెట్టి మరీ ఉద్ధవ్ థాక్రే తన పదవికి ముప్పు తెచ్చుకున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. షిండే ఇపుడు గట్టి పిండంగా మారారు. ఆయన ఎవరికీ తల వంచేది లేదు అంటున్నారు.
మరి కొత్త పార్టీ పెడతారా లేక బీజేపీలో చేరిపోతారా అన్నది అయితే తెలియడంలేదు. ఏది ఏమైనా శివసేనలో భూకంపం తెచ్చి ఓవర్ నైట్ ఏక్ నాధ్ షిండే దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయారు. ఉద్ధవ్ ఉత్సవ విగ్రహం అని అంతా అనుకునేలా చేశారు అని అంటున్నారు.