Begin typing your search above and press return to search.
బాల సాయిబాబా కన్నుమూత..
By: Tupaki Desk | 27 Nov 2018 7:55 AM GMTకర్నూలు జిల్లాకు చెందిన ఆధ్యాత్మిక గురువు బాలసాయిబాబా కన్నుమూశారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం బాలసాయి గుండెపోటుతో మృతిచెందారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. హైదరాబాద్ దోమలగూడలోని ఆశ్రమంలో నిన్న అర్ధరాత్రి బాల సాయిబాబా గుండెపోటుకు గురవగా - భక్తులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
1960 జనవరి 14వ తేదీన కర్నూలులో జన్మించారు బాలసాయిబాబా. ఆయనకు 18 ఏళ్ల వయస్సులోనే కర్నూలులో తొలి ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆయన ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులు ఉన్నాయి. ప్రతీ ఏడాది ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేవారు.ఆయన జన్మదిన వేడుకలకు స్థానిక నేతలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు. ఇక శివరాత్రి రోజు ఆయన నోటి నుంచి శివలింగాన్ని తీస్తుండేవారు. ఇదిలాఉండగా, ఆయన పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. భూ వివాదాలు - చెక్ బౌన్స్ కేసులు ఉండగా... ఆయన ట్రస్ట్ కు సంబంధించిన ఆస్తులపై కూడా వివాదాలు నడుస్తున్న సమయంలో ఆయన కన్నుమూశారు.