Begin typing your search above and press return to search.
కేటీఆర్ పేరుపై బాలయ్య ఆసక్తికర కామెంట్
By: Tupaki Desk | 24 May 2018 10:17 AM GMTహైదరాబాద్ లో హీరో నందమూరి బాలక్రిష్ణ సారథ్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పటల్లో అడ్వాన్సుడ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ - బసవతారకం ఆస్పత్రి చైర్మర్ నందమూరి బాలక్రిష్ణ కలిసి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బాలక్రిష్ణ నా ఇష్టమైన నటుడని.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గురించి మా అమ్మ నాతో 100 సార్లు చెప్పి ఉంటుందని.. ఆస్పత్రికి వచ్చే రోగుల వసతికి కానీ.. ఆసుపత్రి అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలని ’ అంటుంటుదని అన్నారు.
తాను మున్సిపల్ మంత్రినయ్యాక కూడా ఈ ఆస్పత్రి గురించి మా అమ్మ గుర్తు చేశారని కేటీఆర్ అన్నారు. అలాగే క్యాన్సర్ ని అవగాహనతోనే నిర్మూలించవచ్చని..ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రి సూచించారు. సెలెబ్రెటీలందరూ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కోరారు. నా పేరు తారకరామారావు అని.. ఆ పేరు నిలబెట్టే పనిచేస్తాను కానీ.. చెడగొట్టే పని మాత్రం చేయనని కేటీఆర్ స్పష్టం చేశారు.
అనంతరం మాట్లాడిన బాలయ్య మంత్రి కేటీఆర్ పేరు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. ‘సీఎం కేసీఆర్ తన కుమారుడికి తారకరామారావు అని పేరు పెట్టడం సంతోషకరమని’ బాలక్రిష్ణ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఈ బీఎంటీ యూనిట్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. 40 బెడ్స్ తో ఈ ఆస్పత్రి ప్రారంభించానని.. ఇప్పుడు ప్రపంచస్థాయికి ఎదగడంలో వైద్యుల కృషి ఉందని కొనియాడారు. ఇలా మంత్రి కేటీఆర్, బాలయ్యల పరస్పర ప్రశంసలతో వేదిక కాస్త ఉత్సాహభరితంగా మారిపోయింది.