Begin typing your search above and press return to search.
బాలకృష్ణ.. సతీసమేత ప్రచారం!
By: Tupaki Desk | 29 March 2019 5:39 PM GMTగత ఐదేళ్లలో బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గానికి ఎన్ని సార్లు వెళ్లారో తెలియదు కానీ - ఎన్నికల సమయంలో మాత్రం సతీసమేతంగా అక్కడే మకాం పెట్టారాయన. బాలకృష్ణ ఒకవైపు ప్రచారం చేసుకొంటూ ఉండగా.. మరోవైపు ఆయన భార్య కూడా రంగంలోకి దిగారు. ఆమె మరోవైపు నుంచి ప్రచారం చేసుకొంటూ వస్తున్నారు.
ఇలా భార్యభర్తలు నియోజకవర్గంలో గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలను సాగిస్తూ ఉన్నారు. గత ఎన్నికల సమయంలో కూడా బాలకృష్ణ భార్య వసుంధర హిందూపురంలో మకాం పెట్టారు. అప్పుడు కూడా భర్త విజయం కోసం ఆమె ప్రచారం చేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె హిందూపురం నియోజకవర్గం పరిధిలో గట్టిగా తిరుగుతూ ఉన్నారు. భర్తను గెలిపించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారామె.
మరి భార్యభర్తల ప్రచారం అక్కడ తెలుగుదేశం పార్టీకి మరోసారి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి. ఇక మరోవైపు బాలకృష్ణ రాజకీయ ప్రత్యర్థులు కూడా పోరాడుతూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున హిందూపురంలో ఇక్బాల్ అహమద్ పోటీలో ఉన్నారు. ఆయన అనూహ్యంగా అక్కడకు అభ్యర్థిగా వచ్చారు.
ఇక నవీన్ నిశ్చల్ - అబ్దుల్ ఘనీలు కూడా అక్కడ అభ్యర్థిత్వం విషయంలో కొన్ని రోజులు ప్రచారం పొందారు. అయితే వారికి కాకుండా ఇక్బాల్ కు టికెట్ దక్కింది. ఈ నేపథ్యంలో వారిద్దరూ సపోర్ట్ చేస్తారా అనేది ప్రశ్నార్థకంగానే నిలిచింది. ప్రస్తుతానికి అయిఏత.. నవీన్ నిశ్చల్, అబ్దుల్ ఘనీలు ఇక్బాల్ వెంట కనిపిస్తూ ఉన్నారు. ఆయన విజయం కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. పోలింగ్ నాటి వరకూ వారిద్దరూ ఇక్బాల్ కు గట్టిగా సపోర్ట్ చేస్తే మాత్రం హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ - టీడీపీల మధ్యన పోరు రసవత్తరమే అని స్థానికులు అంటున్నారు!