Begin typing your search above and press return to search.
బాలయ్య భయపడ్డాడు
By: Tupaki Desk | 28 March 2019 8:30 AM GMTసినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా బాలయ్యకు భయపెట్టడమే వచ్చు కానీ భయపడడం రాదు. కానీ మొదటిసారి మీడియా జోలికి వచ్చినందుకు భయపడ్డాడు బాలయ్య. ఫేస్ బుక్ సాక్షిగా క్షమాపణలు చెప్పాడు. నిన్న అనంతపురంలో ఒక విలేఖరిపై చేయి చేసుకున్నాడు బాలయ్య. చేయి చేసుకోవడమే కాదు.. చంపేస్తాను, నరికి పోగులు పెడతాను, బాంబులు వేస్తాను, కత్తి తిప్పుతాను అంటూ సినిమా డైలాగులు చెప్పాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాతో పాటు టీవీ మీడియాలోనూ హైలెట్ అయ్యింది. అసలే ఎన్నికల సమయం. ఇలాంటి టైమ్ లో రిస్క్ ఎందుకు అని అనుకున్నాడో ఏమో క్షమాపణలు చెప్పాడు. చిన్నపిల్లలపై పడి వీడియో తీస్తుండడంతో వాళ్లంతా అల్లరి మూకలు అనుకున్నా. సహించలేకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని, వారు మీడియా తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.
పబ్లిక్ ప్లేసుల్లో జనాల్ని కొట్టడం బాలయ్యకు అలవాటే. గతంలో చాలా సార్లు కొట్టాడు. అయితే అప్పుడు కొట్టించుకున్నవాళ్లు అందరూ ఆయన అభిమానులు కాబట్టి చెల్లింది. కానీ ఈసారి మీడియా వ్యక్తిని కొట్టేసరికి అది కాస్తా వైరల్ అయ్యింది. ఇప్పటికే హిందూపురంలో అంతంతమాత్రంగా ఉన్న ఇమేజ్.. ఈ దెబ్బకు మొత్తం పోతుందని ఊహించిన బాలయ్య సైలెంట్ గా కాంప్రమైజ్ కు వచ్చాడు. సోషల్ మీడియా సాక్షింగా సారీ చెప్పాడు. బహుశా బాలయ్య సారీ చెప్పిన మొదటి సందర్భంగా ఇదే అనుకుంటా.