Begin typing your search above and press return to search.
మిత్రుడికి టికెట్: బాబుకు బాలయ్య హామీ
By: Tupaki Desk | 15 March 2019 8:16 AM GMTతన మిత్రుడైన కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు కోసం ఏకంగా నటుడు - ఎమ్మెల్యే బాలక్రిష్ణనే రంగంలోకి దిగారు. బుధవారం కనిగిరి సీటును బాబూరావుకు ఇవ్వకుండా చంద్రబాబు ఉగ్ర నరసింహారెడ్డికి కట్టపెట్టడానికి రెడీ కావడంతో బాలయ్య హుటాహుటిన బుధవారం హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. కనిగిరి అసెంబ్లీ టికెట్ ను తిరిగి కదిరికే ఇవ్వాలని ముఖ్యమంత్రిపై బాలయ్య ఒత్తిడి పెంచినట్లు తెలిసింది.
కానీ చంద్రబాబు మాత్రం సర్వేల సమాచారాన్ని బాలయ్యకు చూపించి బాబూరావు గెలవడని చెప్పినట్టు తెలిసింది. కానీ బాలయ్య మాత్రం.. ‘మీరు టికెట్ ఇవ్వండి.. నేను కూడా వెళ్లి ప్రచారం చేసి కదిరిని గెలుపించుకొని వస్తానని’ బాబుకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.
బాలయ్య కోరిక మేరకు ముఖ్యమంత్రి వ్యూహం మార్చి కనిగిరిని తిరిగి కదిరి బాబురావుకే ఇచ్చేశాడు. కనిగిరి టికెట్ ఆశించిన ఉగ్రనరసింహారెడ్డిని దర్శి నుంచి బరిలోకి దించడానికి చంద్రబాబు నిర్ణయించారు.
అయితే అంతకుముందు దర్శి నుంచి పోటీచేయడానికి ఉగ్ర నరసింహారెడ్డి ఒప్పుకోలేదని సమాచారం. తనకు కనిగిరినే కావాలని కోరాడు. సర్వేలో కూడా తన పేరే వచ్చిందని బాబును ఒప్పించాడు. కానీ కనిగిరిపై బాలక్రిష్ణ ఒత్తిడి చేయడంతో టికెట్ బాబూరావుకే ఇచ్చాడు.
ఇక కనిగిరి కోసం పట్టుబట్టిన ఉగ్ర నరసింహారెడ్డి చివరకు బాబు ఒత్తిడి మేరకు దర్శి టికెట్ పై పోటీచేసేందుకు ఒప్పుకున్నట్టు తెలిసింది.