Begin typing your search above and press return to search.
ఆ ఎంపీ రిసెప్షన్ లో అందరి కళ్లు ఆయనపైనేనట
By: Tupaki Desk | 19 Jun 2017 7:35 AM GMTఏపీ ఎంపీ.. దివంగత టీడీపీ సీనియర్ నేత కింజరపు ఎర్రన్నాయుడి కుమారుడు రామ్మోహన్ నాయుడు వివాహ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. నిమ్మాడలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వేలాదిగా ప్రజలు రిసెప్షన్ కు వచ్చారు.
రాజకీయ.. సినిమా రంగంతో పాలు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పెళ్లి రిసెప్షన్ కు బారులు తీరారు. ఇంతమంది ఉన్నా.. వేడుకకు వచ్చిన వారందరి దృష్టి మాత్రం ఒక్కరి మీదనే ఉంది. ఆయనే.. సినీ నటుడు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆయన వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంతవరకూ అందరి దృష్టి బాలయ్య మీదనే ఉండటం గమనార్హం.
కార్యక్రమానికి వచ్చిన బాలకృష్ణ.. వేలాది మందిని ఉద్దేశిస్తూ చేతులు ఊపటం.. నమస్కారాలు పెట్టటం లాంటివి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆయన స్పందనకు కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి కూడా చక్కటి రెస్పాన్స్ రావటం విశేషం.
కింజరపు కుటుంబీకుల్ని పేరు పేరునా పలుకరించిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కారణంతోనే తాను రిసెప్షన్ కు వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ ఫంక్షన్ కు రావటం తనకు సొంతింటి పెళ్లికి వచ్చినట్లు ఉందన్న బాలకృష్ణ మాటలతో రామ్మోహన్ నాయుడి కుటుంబం సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. మొత్తానికి పెళ్లి రిసెప్షన్ లో బాలకృష్ణ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలవటం విశేషంగా చెప్పకతప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/