Begin typing your search above and press return to search.
తండ్రి స్థాపించిన పార్టీ కూలుతున్నా బాలకృష్ణ మాట్లాడడేంటి?
By: Tupaki Desk | 13 March 2020 2:30 PM GMTతొమ్మిది నెలల పాలనలో రాజకీయంగా టీడీపీపై విమర్శలు చేసిన వైఎస్సార్సీపీ ఇప్పుడు తనదైన శైలిలో రాజకీయం చేస్తోంది. స్థానిక ఎన్నికలు రావడంతో టీడీపీని కనుమరుగు చేసేలా ఒక వ్యూహంతో ముందుకువెళ్తోంది. దీని దెబ్బకు ఆ పార్టీ కోలుకోలేని విధంగా తయారవుతోంది. ఆ పార్టీ నుంచి అధికార పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకుల వరకు ఒకే అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీనికితోడు ఆయన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా అధికార పార్టీ షాకివ్వడంతో ఆయన నోరుమెదపడం లేదు.
ఈ వారంలో వైఎస్సార్సీపీ వేస్తున్న ఎత్తులకు బావమరుదులు చంద్రబాబు, బాలకృష్ణ గందరగోళ స్థితిలో కూరుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించడం మాత్రం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తండ్రి స్థాపించిన పార్టీ ఇప్పుడు కూలిపోతుంటే దివంగత ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నోరు మెదపడం లేదు. ఈ సంఘటనలపై స్పందించడం లేదు. స్థానిక ఎన్నికలు వచ్చాయి.. తన హిందూపురం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయడం లేదు. బాలకృష్ణ కూడా అధికార పార్టీతో రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించడం లేదు. అధికార పార్టీ దెబ్బకు రాజకీయం వదిలేసి సినిమాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల లేపాక్షి ఉత్సవాల సందర్భంగా నామమాత్రంగానైనా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణను గౌరవించలేదని ఆయన మనస్తాపం చెందాడు.
ముఖ్యంగా ఆయనకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు వెళ్లితే కూడా నోరు మెదపడం లేదు. దీంతోపాటు తన తండ్రి ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి టీడీపీలో ఉంటున్న రామసుబ్బారెడ్డి, కరణం బలరాం కూడా అధికార పార్టీలో చేరడంతో ప్రస్తుతం టీడీపీ పునాదులు కదులుతున్నాయి. తన తండ్రి స్థాపించిన పార్టీ కుప్పకూలుతున్న బాధ్యతాయుతంగా బాలకృష్ణ స్పందించకపోవడం విస్మయం కల్పిస్తోంది. నాడు టీడీపీని చంద్రబాబు చేతిలోకి రావడానికి ముఖ్య కారకుడిగా నిలిచిన బాలకృష్ణ ఇప్పుడు అదే చంద్రబాబు వైఖరి తో పార్టీ ఉనికి లేకుండా పోతున్నా ఆయన స్పందించక పోవడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.