Begin typing your search above and press return to search.
బాలయ్య మాట : చంద్రబాబు కు మూడ్ వస్తే ..
By: Tupaki Desk | 4 Dec 2018 11:14 AM GMTమైక్ అందుకుంటే నందమూరి బాలకృష్ణ ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. మొన్న ఎన్నికల ప్రచారంలో దిగినప్పటి నుంచి బాలయ్య నోటి నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. ‘‘చంద్రబాబు వద్దంటే శంషాబాద్ ఎయిర్ పోర్టు మూసేయండి’’.. ఈ తరహా కామెడీ డైలాగ్స్ చాలానే పేల్చాడు బాలయ్య. దీని పై సోషల్ మీడియాలో ఇప్పటికే బోలెడంత కామెడీ పండుతోంది.
తాజాగా బాలయ్య తనదైన శైలిలో ఇంకో పంచ్ వేశాడు. ‘‘చంద్రబాబుకు మూడ్ వస్తే ఊరుకోరు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచమంతా తిరుగుతారు’’ అంటూ బాలయ్య పేల్చిన తాజా డైలాగ్ చర్చనీయాంశమవుతోంది. దీన్ని జనాలు నెగెటివ్ సెన్స్ లోనే తీసుకుంటున్నారు. చంద్రబాబుకు మూడ్ వస్తే ప్రపంచమంతా తిరుగుతారు అన్న కామెంట్ పెట్టి ఇటు బాలయ్యను.. అటు చంద్రబాబును కలిపి ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
మరోవైపు కేసీఆర్ మీద.. టీఆర్ఎస్ సర్కారు మీద బాలయ్య కొంచెం గట్టిగానే విమర్శలు చేశాడు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం భారీగా దోచుకుంటోందని ఆరోపించాడు. ఈ రీ డిజైన్లతో సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నాడు. రాష్ట్రంలో కౌలు రైతులను కేసీఆర్ అసలు రైతులుగానే పరిగణించడం లేదన్న బాలయ్య.. రైతు బంధు పథకం కింద వీరిని చేర్చడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నారన్నాడు. అక్షరాస్యతలో తెలంగాణ దిగజారిపోయిందని.. మద్యం అమ్మకాల్లో మాత్రం టాప్ గా నిలిచిందని విమర్శించాడు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతి విలయతాండవం చేస్తోందన్నాడు.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి 3 కిలో మీటర్లకు ఓ ప్రాథమిక పాఠశాల.. ప్రతి 5 కిలోమీటర్లకు ఓ ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిందని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడున్న స్కూళ్లనే మూసేస్తోందన్నాడు. ప్రజలకు మద్యం అలవాటు చేస్తూ..‘బాంచన్ దొర.. నీ కాళ్లు మొక్కుతా’ అనే పెత్తందారి సంస్కృతి కి బీజం వేస్తోందని కూడా బాలయ్య అన్నాడు. ఐతే ఇక్కడ బాలయ్య చేసిన చాలా విమర్శలు.. ఏపీలో చంద్రబాబు సర్కారుకు అన్వయించుకునేలా ఉండటం గమనార్హం.