Begin typing your search above and press return to search.
పోరాటం చేయొచ్చుగా బాలయ్య
By: Tupaki Desk | 15 Aug 2015 10:14 AM GMTస్వర్గీయ నందమూరి తారకరాముడి వారసుడిగా తెర మీదకు వచ్చిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లోనూ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తారని భావించారు. అయితే.. అందుకు తగ్గట్లుగా బాలయ్య వ్యవహరించలేదన్న విమర్శ ఉంది.
రాజకీయాలతో సన్నిహితంగా ఉంటూనే.. అంతే దూరంగా ఉన్నట్లుగా వ్యవహరించిన బాలకృష్ణ 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగటం.. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే. గెలిచిన తర్వాత.. నియోజకవర్గానికి చుట్టం చూపుగా వ్యవహరించే మిగిలిన నేతల మాదిరిగా కాకుండా.. నియోజకవర్గంలోని వారికి నిత్యం టచ్ లో ఉంటూ.. వారి ఆదరాభిమానాలు పొందుతున్న బాలయ్యకు ప్రజాప్రతినిధిగా మంచి పేరే వచ్చింది.
తాజాగా ఆయన హిందూపురంలో పర్యటిస్తున్న సందర్భంగా.. ఏపీకి ప్రత్యేకహోదా మీద కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ బాలయ్య డిమాండ్ చేశారు. బాలయ్య లాంటి వ్యక్తి నోటి నుంచి డిమాండ్ మాట కాకుండా.. అంతకు మించి అన్న దాని గురించి ఎదురుచూస్తున్న వారికి బాలయ్య మాటలు నిరాశ కలిగించటం ఖాయం. డిమాండ్ చేసే బదులు.. పోరాటం చేయొచ్చుగా బాలయ్య అనేవాళ్లున్నారు. బావకు ఇబ్బంది కలిగించే పని బావమరిది చేయగలరా?