Begin typing your search above and press return to search.
బాలయ్యకు అసమ్మతి పోరు.. గట్టెక్కగలడా?
By: Tupaki Desk | 8 March 2019 6:03 AM GMTరాజకీయాల్లో వర్గపోరు సహజమే. అయితే ఇవి ఎన్నికల సమయంలోనే బహిర్గతం అవుతాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి బామ్మర్ది - సినీ నటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో వర్గపోరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను ఓ వర్గం వ్యతిరేకించడంతో పాటు ఇటీవల బాలకృష్ణ పాల్గొన్న కార్యక్రమంలో సదరు టీడీపీ ముఖ్య నాయకులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇద్దరు ప్రత్యర్థులను ఒక్కపార్టీలోకి తెచ్చి వారి మధ్య సమన్వయం చేయడంలో చంద్రబాబు ఇప్పటికే కొన్ని చోట్ల సఫలీకృతుమయ్యారు. అనంతపురంలో జేసి- పరిటాల ఫ్యామిలీ - కర్నూలు జిల్లాలోని కోట్ల- కేఈ కుటుంబాలు ఒకప్పుడు ప్రత్యర్థులు. వీరు ఒకే పార్టీ గొడుగు కిందకు వచ్చి ఈ ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నారు. అయితే హిందుపురం నియోజకవర్గంలో రెండు కుటుంబాల ప్రత్యర్థులు కూడా ఈసారి ఒకే కండువా కప్పుకున్నారు. కానీ ఈ కుటుంబాలు మాత్రం కలిసి నడవలేమంటూ ఎమ్మెల్యే బాలయ్యకు షాక్ ఇస్తున్నారు. .
హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పలు శంకుస్థాపనలు - ప్రారంభోత్సవాలను చేశారు. ఈ సందర్భంగా పార్టీలోని నాయకులంతా హాజరయ్యారు. కానీ స్థానిక ఎంపీపీ సుభద్ర వర్గం మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఆమెతో పాటు ఆమె భర్త - మాజీ సర్పంచ్ నాగభూషణం - వారి వర్గీయులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు.
సింగిల్ విండో అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఇటీవల టీడీపీలో చేరారు. ఆనంద్ కుమార్ ది - ఎంపీపీ సుభద్రది ఒకే గ్రామం. అలాంటి సమయంలో తమకు తెలియకుండా ఆనంద్ కుమార్ ను పార్టీలోకి తీసుకోవడంపై సుభద్ర ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో సుభద్ర ఫ్యామిలీ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. మరోవైపు ఆనంద్ కుమార్ కు బాలకృష్ణ పీఏ దగ్గర కావడంతో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె వర్గీయులు అలక వహించారు.
అయితే సుభద్ర ఫ్యామిలీ మాత్రం బాలకృష్ణ పీఏ వ్యవహర శైలీ నచ్చకే ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని చెబుతున్నారు. ఇక కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న చిలమత్తూరు ఏంపీపీ నౌజీయాబాయి తాజాగా బాలకృష్ణ పర్యటనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాత్రం సుభద్ర ఫ్యామిలీ దూరంగా ఉండడంపై ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర చర్చ సాగుతోంది.