Begin typing your search above and press return to search.
బాలయ్యకు చేదు అనుభవం..అస్సలు ఊహించలేదట!
By: Tupaki Desk | 5 April 2019 4:30 AM GMTవివాదాల్లో ఇరుక్కోవటంలో ప్రముఖ సినీ నటుడు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చేతనైనంత మరెవరికీ చేతకాదంటారు. అభిమానంతో ఆయన చేతిని తాకినా..తోలు తీస్తానంటూ విరుచుకుపడతారు. ఆత్మీయంగా సెల్ఫీ తీసుకోకపోతే అడ్డదిడ్డంగా తిట్టేసే ఉదంతాలు ఉన్నాయి. ఇలా తన మాటతో.. తీరుతో తరచూ వివాదాల్లోకి చిక్కుకునే బాలకృష్ణ తాజాగా చేదు అనుభవం ఎదురైంది.
ఓట్లు అడిగేందుకు హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న బాలకృష్ణ.. చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడి మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తమకున్న తాగునీటి సమస్యను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం..స్థానిక నాయకత్వం విఫలమైన నేపథ్యంలో.. వారు బాలకృష్ణ ప్రచారానికి నిరసన తెలిపారు.
నీళ్లు ఇవ్వరు కానీ.. ఓట్లు అడిగేందుకు ప్రచారానికి వస్తారా? అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న బాలయ్య.. స్థానిక నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ఫైర్ అయ్యారు.
హిందూపురంలో గెలిచిన నాటి నుంచి చుట్టం చూపుగా నియోజకవర్గానికి రావటం.. ఒకవేళ వచ్చినా హడావుడిగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టటమే తప్పించి స్థానిక నాయకత్వంతో కూర్చొని సమస్యల మీద ఎప్పుడూ మాట్లాడింది లేదని.. ఇప్పుడు తమపై మండిపడటంపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన బాలయ్యకు ఖాళీ బిందెలతో నిరసన తెలపటం..మారుతున్న రాజకీయ పరిణామాలకు నిదర్శమన్న మాట వినిపిస్తోంది.