Begin typing your search above and press return to search.
బాలయ్యకు సొంతోళ్లే షాకిచ్చారు
By: Tupaki Desk | 1 July 2017 4:02 AM GMTరాజకీయాలు మహా పాడువు. ఎవరిని ఎప్పుడెట్లా మార్చేస్తాయో అస్సలు అర్థం కావు. తండ్రికి కొడుకును కాకుండా చేస్తాయి. అన్నను సొంత తమ్ముడే ఇరగదీసేలా చేస్తాయి. అవసరమైతే మొగుడు.. పెళ్లాలు సైతం కోట్లాటకు దిగేలా చేసే పవర్ రాజకీయాలకు సొంతం. అలాంటిది సినీ ఫ్యాన్స్ గా దశాబ్దాల తరబడి ఉన్న బాలయ్య అభిమానులు తాజాగా చేపట్టిన నిరసన ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ఆయన్ను అమితంగా అభిమానించే వారు బాలయ్యకు షాకిచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్య అభిమానులుగా చెప్పే వారిలో సుమారు 70 శాతం మంది బాలకృష్ణ పర్యటనకు దూరంగా ఉండటం గమనార్హం. ఇంతకూ జరిగిందేమంటే.. నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటీ ఛైర్మన్ గా టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నియమితులయ్యారు. బాలయ్య ఆశీస్సులతోనే ఇదంతా జరిగిందన్నది చెబుతుంటారు. ఈ నేపథ్యంలో తాను అమితంగా అభిమానించి.. ఆరాధించే బాలయ్య సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించాలని కోటంరెడ్డి అనుకున్నారు.
ఇందులో భాగంగా తాజాగా నెల్లూరు నర్తకి సెంటర్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బాలయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఎక్కడ చూసినా బాలయ్యబాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అంతా బాగుంది కానీ.. ఈ కార్యక్రమానికి దివంగత ఎన్టీఆర్.. బాలకృష్ణతో అనుబంధం ఉన్న వారు రాకపోవటం పెద్ద చర్చగా మారింది. అఖిల భారత ఎన్టీఆర్ అభిమానం సంఘ అధ్యక్షుడు.. మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి.. ఆయన సతీమణి అనురాధ.. వారికి చెందిన వర్గం ఈ కార్యక్రమంలో అస్సలు కనిపించలేదు. అదే సమయంలో బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడు కిన్నెర బ్రదర్స్ కూడా రాకపోవటం మరింత చర్చగా మారింది. సొంత అభిమానుల మధ్యన ఏదో అయ్యిందన్న చర్చ షురూ అయ్యింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా బాలయ్యకు సన్మానించిన వారిలో ఎక్కువ మంది చిరంజీవి ఫ్యాన్స్.. టీడీపీ కార్యకర్తలు ఉండటం విశేషం. సొంతోళ్లు దూరంగా ఉన్న కార్యక్రమంలో పరాయివాళ్లు అంతా తామైనట్లుగా వ్యవహరించటంపై పలు చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఎందుకిలా జరిగిందన్న అంశంపై నిఘా వర్గాలు తమదైన శైలిలో క్రాస్ చెక్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమానికి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు డుమ్మా కొట్టేయటం కొసమెరుపుగా చెప్పాలి. బాలయ్య అంటే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కాదు కదా.. సీఎం చంద్రబాబు బావమరిది మాత్రమే కాదు వియ్యంకుడు. అది కాకున్నా.. చినబాబు సొంత మామ. మరి.. అలాంటి వీవీఐపీని సొంత పార్టీనేతలు లైట్ తీసుకున్నట్లుగా వ్యవహరించటం ఏమిటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/