Begin typing your search above and press return to search.
బాలయ్య డేట్లిచ్చాడబ్బా..
By: Tupaki Desk | 15 Nov 2018 1:12 PM GMT2014 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు గెలిచిన తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాతి నాలుగున్నరేళ్లలో ఏ స్థితికి చేరిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేలు మిగల్లేదు.. కార్యకర్తలు మిగల్లేదు. మొత్తంగా పార్టీ ఇక్కడ పూర్తిగా బలహీనపడిపోయింది. ఐతే ఈసారి బద్ధ విరోధ పార్టీ అయిన కాంగ్రెస్ తో జట్టు కట్టి ఎన్నికల్లో అద్భుతాలు చేసేయాలని ఆశిస్తోంది. ఇందుకోసం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మంత్రాంగం నడిపిస్తున్నారు. ప్రచారం కోసం తన బావమరిది నందమూరి బాలకృష్ణను కూడా ఆయన రంగంలోకి దింపుతుండటం విశేషం. బాలయ్య తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం పది రోజులు డేట్లు కేటాయించారు. త్వరలోనే ఆయన హైదరాబాద్ తో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించబోతున్నాడట.
ఆ మధ్య ఖమ్మంలో బాలయ్య పర్యటించినపుడు జనాల నుంచి స్పందన బాగానే వచ్చింది. ఆ తర్వాత ‘యన్.టి.ఆర్’ షూటింగ్ తో బిజీ అయిపోయాడు బాలయ్య. మధ్యలో ఒకసారి తెలంగాణ నేతలు ఆయన్ని కలిసి ప్రచారానికి రావాలని కూడా పిలిచారు. వీలు చూసుకుని వస్తానని బాలయ్య చెప్పాడు. ఇప్పుడు ఆయన వీలు చేసుకుని ప్రచారానికి వస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ ను సైతం ప్రచారానికి రప్పించాలని చూశారట కానీ.. అతను ఒప్పుకోలేదని సమాచారం. ఐతే తలా తోకా లేకుండా మాట్లాడే బాలయ్య వల్ల తెలంగాణలోని నియోజకవర్గాల్లో ఏమాత్రం ప్రయోజనం దక్కుతుందన్నది ప్రశ్న. పైగా ఈ మధ్య బాలయ్యకు నోటి దురుసు బాగా ఎక్కువవుతోంది. తరచుగా నోరు జారుతున్నారు. బూతులు కూడా వాడేస్తున్నాడు. తానేం మాట్లాడతాడో తనకే తెలియని పరిస్థితి. మరి ఎన్నికల ప్రచారంలో బాలయ్య ఏమాత్రం నోటిని అదుపులోకి పెట్టుకుని.. ఎలాంటి ప్రసంగాలు చేస్తారో చూడాలి.