Begin typing your search above and press return to search.
బాలయ్య బాబుకు ''ప్రత్యేక'' నమ్మకం ఉందట
By: Tupaki Desk | 24 May 2015 6:26 AM GMTఏపీకి ప్రత్యేకహోదా విషయంలో చిన్నపిల్లాడిని అడిగినా మోడీ సర్కారు తొండాట ఆడుతున్నాడని ఇట్టే చెప్పేస్తారు. అయినప్పటికీ.. మోడీ మీదా ఆయన పరివారం మీద విపరీతమైన నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు ఏపీ అధికారపక్ష నేతలు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలు ప్రతిఒక్కరూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటం గ్యారెంటీ అంటూ ఢంకా బజాయించి చెబుతారు. నిన్నటికి నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా అంశం అటక మీదకు ఎక్కేసినట్లేనన్న తీరులో మాట్లాడటం మర్చిపోలేనిది.
నిజానికి జైట్లీ కొత్త విషయం ఏమీ చెప్పలేదు. ఎప్పుడైతే ప్రత్యేకహోదా మీద రాతపూర్వకంగా సమాదానం ఇచ్చే క్రమంలో తూచ్ అన్నారో అప్పుడే.. ఏపీకి ప్రత్యేకహోదా రావటం అసాధ్యమని తేలిపోయింది. ఇంతలా ఇన్ని విషయాలు కనిపిస్తున్నా.. హిందూపురం ఎమ్మెల్యే.. చంద్రబాబు బావ కమ్ వియ్యంకుడు బాలయ్యబాబుకు మాత్రం ప్రత్యేకహోదా మీద చాలానే ఆశలు ఉన్నాయి.
ప్రధాని మోడీ మీద తనకు నమ్మకం ఉందని.. త్వరలోనే ఏపీకి ప్రత్యేకహోదా వస్తుందని తాను అనుకుంటున్న చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా కోసం రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పిన ఆయన.. ఈ విషయం మీద బాబు ఇప్పటికే మోడీతో మాట్లాడారన్నారు. బాబు మాట మోడీ వినే పరిస్థితే ఉంటే.. ఇంతకాలం ప్రత్యేకహోదా ప్రకటన కోసం ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు కదా.