Begin typing your search above and press return to search.
జగన్ తో బాలయ్య డైరెక్ట్ ఫైట్ కి రెడీ...?
By: Tupaki Desk | 6 Jan 2023 5:57 PM GMTనందమూరి నటసింహం వెండి తెర మీద చెలరేగిపోతాడు. రాజకీయాల్లో ఆయన బావ చాటు బావమరిదిగానే ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కి బాలయ్య దూరంగా ఉంటారు. ఆయన ఎన్టీయార్ వారసుడు అయినా నట వారసుడిగానే పూర్తి స్థాయిలో కంటిన్యూ అవుతున్నారు. రాజకీయంగా మాత్రం తన పరిధి మేరకే ఉంటూ వస్తున్నారు. ఆయన 2014, 2019లలో రెండు సార్లు హిందూపురం నుంచి గెలిచి సీనియర్ ఎమ్మెల్యేగా పార్టీలో ఉన్నారు. పార్టీ అత్యున్నత రాజకీయ వేదిక అయిన పాలిట్ బ్యూరో లో మెంబర్ గా ఉన్నారు.
ఇక చంద్రబాబే మరోసారి సీఎం కావాలని బాలయ్య కోరుకుంటున్నారు. అదే టైం లో తన మేనల్లుడు అల్లుడు అయిన లోకేష్ ని ప్రోత్సహిస్తున్నారు. అందుకే బాలయ్య సీఎం అన్న కేకలు ఏవీ ఆయన సినీ రాజకీయ సభలలో ఎక్కడా వినిపించడంలేదు, కనిపించడంలేదు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాలయ్య వచ్చే ఎన్నికలలో ఏ విధంగా వ్యవహరిస్తారు ఆయన పొలిటికల్ అజెండా ఏంటి టార్గెట్ ఏంటి అన్నది రకరకాలుగా ప్రచారంలో ఉన్నా వీర సింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ తో చాలా వరకూ బయటపడింది.
ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అలాగే పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. బాలయ్య వాటిని విలన్ల మీద ప్రయోగించినా వర్తమాన రాజకీయ పరిస్థితులతో పోల్చినపుడు కచ్చితంగా జగన్ మీదనే అన్న భావన అయితే అందరిలో కలిగే అవకాశం ఉంది. బోర్డుల మీద పేర్లను జీవోలతో మార్చేస్తే చరిత్ర మారదు, చరిత్ర సృష్టించిన వారు మారరు అన్న బాలయ్య పక్కా మాస్ పంచ్ డైలాగ్ జగన్ సర్కార్ మీదనేనా అన్న చర్చ మొదలైంది.
ఈ మధ్యనే ఎన్టీయార్ హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా పేరు మారుస్తూ జగన్ తీసుకున్న నిర్ణయం మీదనే బాలయ్య ఈ డైలాగ్ వేశారని అంటున్నారు. ఇదొక్కటే కాదు చాలా డైలాగులు ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా వరకూ మాత్రమే అనుకోవడానికి లేదని ఒక టార్గెట్ ప్రకారమే డైలాగ్స్ పెట్టి ఉంటారని అంటున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ మీద విమర్శలు చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నారని, చంద్రబాబు సైతం రాయలసీమలో బాలయ్యకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చోటనే పార్టీ ప్రచార బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారు అని అంటున్నారు. బాలయ్య సైతం గతంలోలా తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా సీమ జిల్లాలలో తెలుగుదేశం గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుంటారని అంటున్నారు.
అందుకే వీర సింహారెడ్డి సినిమా ట్రైలర్ ని అందులో డైలాగులను జస్ట్ అలా అని ఎవరూ తీసుకోవడం లేదు అంటున్నారు. బాలయ్య వైసీపీ సర్కార్ మీద చేసే డైరెక్ట్ ఫైట్ కి అది ట్రైలర్ అని అంటున్నారు. మరి 2024 ఎన్నికలో బాలయ్య రాజకీయ సింహం అవుతారా అంటే చూడాల్సిందే.