Begin typing your search above and press return to search.
జగన్ ను రెండు కోరికలు కోరిన బాలకృష్ణ
By: Tupaki Desk | 13 July 2020 5:34 PM GMTబాలకృష్ణ ఎక్కడైనా బాలకృష్ణ లాగానే ఉంటారు గాని హిందూపురం నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి అచ్చమైన ఎమ్మెల్యేగా మారిపోతారు. తనను గెలిపించిన కృతజ్జత వల్ల తన పార్టీ కంటే కూడా తన నియోజకవర్గ ప్రజలకు అనుగుణంగా మెలగుతారు. అందుకే తన వియ్యంకుడు చంద్రబాబు నొచ్చుకున్నా పర్లేదు గాని జగన్ కు థాంక్స్ చెప్పేశారు. ఇంతకీ బాలకృష్ణ తనకు థాంక్స్ చెప్పేపని ముఖ్యమంత్రి జగన్ ఏం చేశారనుకుంటున్నారా? అదే కదా ఈ వార్త.
హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే, సీనియర్ టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు రెండు లేఖలు రాశారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గానికి అది కూడా తన నియోజకవర్గమైన హిందూపురం ప్రాంతానికి మెడికల్ కళాశాల మంజూరు చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. దీంతో పాటు ఒక రిక్వెస్టు కూడా చేశారు. "మెడికల్ కాలేజీ హిందూపూర్ విద్యార్థులకు మాత్రమే కాకుండా మొత్తం రాయలసీమ విద్యార్థులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. మెడిసిన్ కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తుంది‘‘ అన్నారు. అయితే, ఈ కళాశాలను కదిరి రహదారిపై హిందూపూర్ మండలంలోని మలుగూరు ప్రాంతంలో ఏర్పాటుచేయాలని బాలకృష్ణ ముఖ్యమంత్రిని కోరారు. రెవెన్యూ అధికారులు ఈ ప్రాంతాన్ని సర్వే చేసి, ఈ గ్రామంలో 52 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారని, ఇది వైద్య కళాశాల ఏర్పాటుకు అనువైనదని అన్నారు. పరిసర ప్రాంతాల్లో పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు ఉండటం వల్ల ఇది మెడికల్ కాలేజీకి కూడా అనుకూలంగా ఉంటుంది అన్నారు. రోడ్డు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు.
దీంతో పాటు బాలకృష్ణ జగన్ కు మరో లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటుచేయబోయే జిల్లాల్లో హిందూపురం జిల్లాను ఏర్పాటుచేయాలని, జిల్లా కేంద్రంగా హిందూపురం పట్టణాన్ని పెట్టాలని కోరారు. హిందూపురం వ్యాపార పరంగా ఎదుగుతోందని... జిల్లా ఏర్పాటు వల్ల మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. మెడికల్ కాలేజీ బాలకృష్ణ అడిగిన చోట పెడతారో లేదో తెలియదు గాని... హిందూపురం ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా చేసే కోరికను జగన్ నెరవేర్చే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలు ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కేంద్రం కావడంతో అదే జిల్లాను ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తోంది. అయితే... దీనికి పుట్టపర్తి పట్టణం పోటీలో ఉన్నా అది ఒక మూలన ఉంది.