Begin typing your search above and press return to search.

లోకేష్ జ‌పం ఓకే..కానీ బాల‌య్య ఎక్క‌డ‌?

By:  Tupaki Desk   |   28 May 2017 5:24 AM GMT
లోకేష్ జ‌పం ఓకే..కానీ బాల‌య్య ఎక్క‌డ‌?
X
తెలుగుదేశం పార్టీ మహానాడు తొలిరోజు స‌మావేశాల‌పై కొత్త చ‌ర్చ మొద‌లైంది. మొద‌టి రోజు స‌మావేశం అంతా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు, తనయుడు లోకేష్ హ‌వానే క‌నిపించింది. అత్యంత ఆస‌క్తిక‌రంగా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ తనయుడు - ఎమ్మెల్యే అయిన నంద‌మూరి బాల‌కృష్ణ గైర్హాజ‌ర‌య్యారు. పార్టీ పండుగ మొద‌టి రోజే చంద్రబాబు వియ్యంకుడు, లోకేష్ మామగారైన నందమూరి బాలకృష్ణ మహానాడుకు హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ జయంతి రోజైన ఆదివారమైనా బాల‌య్య‌ మహానాడుకు వస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మ‌రోవైపు పార్టీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్ భజన చేసేందుకే ప్రతినిధులు ఎక్కువ సమయం ఉపయోగించిన‌ట్లుగా విశ్లేష‌కులు చెప్తున్నారు. వేదికపైసుమారు 8 అంశాలపై చేసిన తీర్మానాల సందర్భంగా మాట్లాడిన తీర్మానాలు ప్రవేశపెట్టిన, బలపరిచిన వారంతా ఇదే తంతును నడిపించారు. ఇందులోనూ కీల‌క అంశాల‌ను విస్మ‌రించారని చెప్తున్నారు. 2014 మ్యూనిఫెస్టోపై తీర్మానం సందర్భంగా రుణమాఫీ, డ్వాక్రా రుణాలు, పింఛన్లు గురించి తప్ప ఏపికి ప్రత్యేక హోదా, నిరుద్యోగ భృతి, విశాఖకు రైల్వేజోన్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తానన్న ముఖ్యమైన హామీలను పూర్తిగా పక్కకు తోసేసి మిగతా విషయాలు చర్చించడం కనిపించింది. మేనిఫెస్టోపై చంద్రబాబు స్పందిస్తూ గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాట్లాడిన్టుగా 'చెప్పిందీ చేశాం.. చెప్పందీ చేశాం...' అన్న మాటను చంద్రబాబు ఉపయోగించారు. అన్న క్యాంటిన్‌ లు - ఎస్సీ - ఎస్టీ - బిసిలకు సబ్‌ ప్లాన్‌ లను ఇందుకు ఉదహరించారు. ప్రతి తీర్మానంపైనా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదనపు విషయాలు జోడిస్తూ ప్రతిపక్ష వైసీపీని ఎండగట్టేందుకు ప్రయత్నం చేశారు.

ఇదిలాఉండ‌గా... టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు పార్టీ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సాధారణ ప్రతినిధి మొదలు జాతీయాధ్యక్షుడు వరకూ అందరూ ప్రతినిధి రుసుం రూ.100 చెల్లించి పేరు నమోదు చేసుకున్నాకే మహానాడు ప్రాంగణంలోకి వెళ్లాలన్నది టీడీపీ విధించుకున్న నిబంధన. ఈ విషయమే ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు వారం రోజుల నుంచి చెపుతూ వచ్చారు. అయితే మహానాడు ప్రారంభం రోజు పార్టీ అధినేతల విషయంలో అలా జరగలేదు. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ప్రతినిధులుగా 100రూపాయలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోకుండానే ప్రాంగణంలోకి వెళ్లి వేదిక ఎక్కారు. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలకూ ఈ నియయం వర్తించకపోవడం గమనార్హం. త‌మ‌కు హిత‌బోధ చేసే నాయ‌కులు వాటిని ఎందుకు పాటించ‌ర‌ని ప‌లువురు నేత‌లు చ‌ర్చించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/