Begin typing your search above and press return to search.

ఆ నవ్వుకు అర్థమేంటి బాలయ్య..?

By:  Tupaki Desk   |   24 Feb 2016 5:30 PM GMT
ఆ నవ్వుకు అర్థమేంటి బాలయ్య..?
X
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సావాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించటానికి వచ్చిన బాలకృష్ణ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నటుడ.. మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేయటం ఒక ఎత్తు అయితే.. కొన్ని ప్రశ్నల సందర్భంగా ఆయన రియాక్షన్ అందరిని ఆకట్టుకునేలా సాగింది.

అన్నింటికంటే.. భూమానారిరెడ్డి సైకిల్ ఎక్కటం వెనుక మీరున్నారట కదా అన్న ప్రశ్నకు.. సమాధానం ఏమీ చెప్పని బాలకృష్ణ నవ్వుతూ.. ఒక చూపు చూసి వెళ్లిపోవటం చర్చగా మారింది. భూమానాగిరెడ్డిని పార్టీలోకి తీసుకురావటానికి బాలకృష్ణ ప్రయత్నించారని.. స్వయంగా ఆయన రంగంలోకి దిగి భూమాతో మాట్లాడటంతో ఆయన పార్టీలోకి వచ్చినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్న సమయంలో.. చాలా కంట్రోల్డ్ గా.. కూల్ గా ఒక్క మాట కూడా మాట్లాడని ఆయన నర్మగర్భపు చూపును చూసి నవ్వుతూ వెళ్లిన తీరును చూసిన వారంతా ‘‘ఇంతకీ ఆ నవ్వుకేంటి అర్థం బాలయ్యా?’’ అనుకోవటం కనిపించింది.