Begin typing your search above and press return to search.
సినిమాలు..రాజకీయం రెండూ ముఖ్యమే:బాలయ్య
By: Tupaki Desk | 7 Jan 2018 4:30 AM GMTసినిమాలు చేస్తా..రాజకీయాల్లో ఉంటానని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ నెల 12న ఆయన నటించిన ‘జైసింహా’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వూ ఇచ్చారు.సినిమా రాజకీయం రెండు ముఖ్యమే అని బాలయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల ఆదరణ వల్లే సంవత్సరానికి రెండు సినిమాలు చేయగలుతున్నా. సినిమా నాకు ఇల్లులాంటిది. రాజకీయాలు నన్ను ఆదరించాయి` అని తెలిపారు.
ఎమ్మెల్యేగా హిందూపురానికి చేయాల్సిన అన్నీ చేస్తున్నాననిబాలకృష్ణ తెలిపారు. `మీకేం కావాలని అడిగితే హిందూపురం ప్రజలు నీళ్లు కావాలని అడిగారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా నీళ్లు ఇవ్వాలనేది నాన్న గారి కల. ఆ కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. ఇదే సమయంలో అటు బసవతారకం ఇండో కేన్సర్ ఆస్పత్రి ద్వారా సేవలు అందిస్తున్నాను. రాజకీయాలు, సినిమా రెండు ముఖ్యమైనవే. ఇలా అన్నీ రంగాల్లోనూ సక్సెస్ అవుతున్నాను.` అని బాలకృష్ణ తెలిపారు. `ఇక సినిమాల విషయానికికొస్తే ‘ఎన్టీఆర్ బయోపిక్’ మార్చిలో ప్రారంభిస్తాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది`. అని బాలయ్య వివరించారు.
పార్టీ గురించి స్పందిస్తూ ...`తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వేసిన బీజం. అది పార్టీ కాదు ఒక వ్యవస్థ. కొత్త రాజకీయానికి ఒక పరమార్ధాన్ని నేర్పించింది. ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఈ అంశాలను మెయిన్‌గా తీసుకుని సినిమా తీస్తాం. ఎన్టీఆర్ బయోపిక్ చేయడం నాకు వరం. మంచి సినిమాలన్నీ నన్ను ప్రేరేపిస్తుంటాయి. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. ఓ షూట్ కూడా చేశాం` అని తెలిపారు.
`ఇక ‘జైసింహా’కి వస్తే బ్రహ్మానందం - నా కాంబినేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. నవరసాలు కలిపితే ‘జైసింహా’ సినిమా. సంక్రాంతి అంటే రైతుల పండుగ. సంవత్సరమంతా పడిన కష్టాన్ని ఈ పండగతో మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి చూడదగ్గ సినిమా ‘జైసింహా’’ అని చెప్పారు.