Begin typing your search above and press return to search.
తన తల్లి పడిన బాధను చెప్పిన బాలయ్య
By: Tupaki Desk | 2 July 2018 4:22 AM GMTతన తల్లి బసవతారకం గురించి చెప్పుకొచ్చారు ప్రముఖ సినీ నటులు కమ్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నవ్యాంధ్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉండే బెజవాడలో ఆయన ఆసుపత్రిని స్టార్ట్ చేశారు. తన తల్లి పేరున బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్నప్పటి సంగతుల్ని ప్రస్తావించారు.
తన తల్లి బసవతారకం కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్న సమయంలో ఆ బాధ మరెవరూ పడకూడదని అనిపించిందని.. చికిత్స సమయంలో ఆమె తీవ్ర బాధకు గురయ్యారని చెప్పారు. కేన్సర్ చికిత్సను అందరికి అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ లో ఇప్పటికే ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు చెప్పిన ఆయన.. తన తండ్రి పుట్టిన కృష్ణా జిల్లాలోనే ఆసుపత్రికి ప్రారంభించటం చాలా హ్యాపీగా ఉందన్నారు.
కేన్సర్ సోకిన వ్యక్తి జీవితం ముగిసిన అధ్యాయం కాదని.. పోరాడే తత్వాన్ని పెంచుకోవాలన్నారు. బెజవాడలో కొలువు తీరిన తమ ఆసుపత్రిలో వారంలో రెండు రోజుల రోగులకు వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు.
రేషన్ కార్డు ఉన్న వారికి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నట్లు చెప్పిన బాలయ్య.. మరీ పేదవారికి ఉచిత వైద్యంతో పాటు.. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. అమరావతిలో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని మూడు దశల్లో చేపట్టనున్నట్లు చెప్పిన బాలకృష్ణ.. దానికి ఆగస్టులో భూమి పూజ చేస్తామన్నారు. పోరాడితే సాధించలేనిది ఏదీ లేదని.. అది జీవించే హక్కు అయినా.. ప్రత్యేక హోదా అయినా అని వ్యాఖ్యానించారు. మరి.. ఇదే మాటను కనీసం మూడేళ్ల క్రితమైనా వియ్యంకుడు చంద్రబాబుకు చెప్పి ఉంటే బాగుండేది కదా బాలకృష్ణ?