Begin typing your search above and press return to search.

క‌రోనా సాయంలోనూ.. బాల‌య్య మార్క్ రాజ‌కీయం

By:  Tupaki Desk   |   9 April 2020 4:30 PM GMT
క‌రోనా సాయంలోనూ.. బాల‌య్య మార్క్ రాజ‌కీయం
X
ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉన్నాయి. లాక్‌ డౌన్ విధించ‌డంతో పేద‌లు - కూలీలు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వారు ఒక్క‌పూట కూడా తినే ప‌రిస్థితి లేదు. ఈ స‌మ‌యంలో మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించాలి. కుల‌ - మ‌త‌ - ప్రాంత‌ - రాజ‌కీయ భావ‌న‌లు ప‌క్క‌నపెట్టేసి ఆదుకోవాల్సిన త‌రుణం ఇది. కానీ భార‌త‌దేశంలో ఇవేవి ప‌ట్టించుకోరు. వేటినైనా రాజ‌కీయం - కులం, -మ‌తం తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో అదే జ‌రుగుతోంది. లాక్‌ డౌన్ నేప‌థ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించ‌డాన్ని కూడా రాజ‌కీయం చేసుకుంటున్నారు. స‌హాయం చేస్తూ రాజ‌కీయాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాయిదా ప‌డిన స్థానిక సంస్థ‌లు - మున్సిప‌ల్ ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి పొందేందుకు ఇప్పుడు క‌రోనా వైర‌స్ ప‌రిస్థితులను వాడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు వియ్యంకుడు - సినీ న‌టుడు - టీడీపీ హిందూపుర‌ము ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌దైన రాజ‌కీయం చేస్తున్నారు.

ఇలాంటి విప‌త్క‌ర‌ పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ నాయకులు రాజ‌కీయం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు లాక్‌ డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ మాస్కులు - కూరగాయలు పంపిణీ చేస్తామ‌నే పేరుతో త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం వినియోగించుకుంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. చేసే స‌హాయం కొంత‌.. ప్ర‌చార ఆర్భాటాలు కొండంత చేస్తున్నారు. గుంపులుగుంపులుగా ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతూ లాక్‌ డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తున్నారు. యథేచ్ఛగా అందరి మధ్య తిరుగుతూ స్థానిక ఎన్నికల ప్రచారాన్ని చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా వారి తీరు ఉంది.

అనంతపురము జిల్లా హిందూపురంలో నిత్యావసర వస్తువుల పంపిణీ పేరుతో ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచ‌రులు - టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు టీడీపీ కండువాలు వేసుకుని క‌ర‌ప‌త్రాలు ప‌ట్టుకుని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్తున్నారు. దీంతో పాటు బాల‌కృష్ణ బొమ్మలు ముద్రించి మరీ పేద‌ల‌కు స‌హాయం పేరిట స‌రుకులు అందిస్తూ రాజ‌కీయం చేస్తున్నారు.

విజయవాడ టీడీపీ మేయర్‌ అభ్యర్థి - ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత రైతుబజార్లు - మార్కెట్లు - ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ మాస్కుల పంపిణీ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కార్య‌క‌ర్త‌లు - నాయ‌కులను వెన‌కేసుకుని ఆమె ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. ఈ స‌హాయం చేస్తున్న క్ర‌మంలో టీడీపీ కండువాలు - క‌ర‌ప‌త్రాలు వెంట ప‌ట్టుకుని న‌డుస్తున్నారు. పేద‌ల‌కు అందించే స‌మ‌యంలో క‌ర‌ప‌త్రాలు కూడా ఇస్తున్నారు. ప‌నిలో ప‌ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నాయ‌కుల‌ను గెలిపించాల‌ని కోరుతున్నారు.

రాష్ట్రంలో చాలాచోట్ల తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇదే తీరున వ్య‌వ‌హారిస్తున్నారు. మాన‌వ‌త్వం మాటున రాజ‌కీయం చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. దీనిపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వైఖ‌రి స‌రికాద‌ని చెబుతున్నారు.