Begin typing your search above and press return to search.

బాబాయ్ కూడా పొగిడారు...ఇపుడేమంటారు తమ్ముళ్ళూ...?

By:  Tupaki Desk   |   18 Nov 2022 5:44 AM GMT
బాబాయ్ కూడా పొగిడారు...ఇపుడేమంటారు తమ్ముళ్ళూ...?
X
తెలుగుదేశం పార్టీ ఇపుడు డైరెక్ట్ గా పోరాడుతోంది వైసీపీ మీద. వైసీపీ పునాదులు అన్నీ కూడా వైస్సార్ మీదనే ఆధారపడి ఉన్నాయి. దివంగత వైఎస్సార్ ఎంత గొప్ప నాయకుడు అయినా ఆయన్ని కనుక పొగిడితే పొలిటికల్ గా అది కొంత ఇబ్బందిగా ఉంటుంది. రాజకీయాల్లో ఈ పారామీటర్స్ అన్నీ ఉంటాయి.

కానీ బోల్డ్ గా మాట్లాడే నందమూరి బాలక్రిష్ణ మాత్రం అన్‌స్టాపబుల్ షో తాజా ఎపిసోడ్ లో వైఎస్సార్ ని పొగిడినట్లుగా ఉంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఆ ప్రోమోను చూస్తే వైఎస్సార్ గొప్ప నాయకుడు అని బాలయ్య కితాబు ఇవ్వడం కనిపిస్తోంది. ఇక మొత్తం ఎపిసోడ్ లో ఏముందో చూడాలి కానీ అపుడే దీని మీద పెద్ద చర్చ, రాజకీయ రచ్చ అయితే మొదలైపోయింది.

అదెలా అంటే బాలయ్య వైఎస్సార్ ని పొగడడం ఏంటి. ఈ మధ్యనే విజయవాడలో హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరుని తీసేసి వైఎస్సార్ పేరు పెట్టారు. అపుడు చాలా పెద్ద వివాదం అయింది. ఆ టైం లో టోటల్ నందమూరి ఫ్యామిలీ ఒకటే మాట అన్నారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టాల్సిందే అని. అదే టైం లో అవతల ఉన్న వైఎస్సార్ పేరు వద్దు అనే వారు స్పష్టంగా చెప్పినట్లే అయింది.

ఇక దాని మీద జూనియర్ ఎన్టీఆర్‌ స్పందిస్తూ ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్ప వారే అని బ్యాలన్స్ చేస్తూ మాట్లాడారు. తాత పేరు తొలగించడం మంచిది కాదంటూనే ఆయన పద్ధతిగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే దాని మీద తమ్ముళ్ళు తెగ గింజుకున్నారు. జూనియర్ వైఎస్సార్ ని ఎన్టీఆర్‌ తో ఎలా పోలుస్తారు అంటూ నిందించారు. పైగా తాత పేరు తీసేస్తే సరిగ్గా ఆయన రెస్పాండ్ కాలేదని విరుచుకుపడ్డారు.

కానీ ఇపుడు బాలయ్య ఏకంగా వైఎస్సార్ గ్రేట్ అంటూ ఔట్రేట్ గా పొగిడేశారు. పైగా బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్నారు. ఆ పార్టీ తరఫున ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. దాంతో జూనియర్ కంటే బాలయ్య ఇచ్చిన ఈ స్టేట్మెంటే పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. దాన్ని అతి పెద్ద తప్పుగా కూడా చెబుతున్న వారు ఉన్నారు.

వైఎస్సార్ పేరు ని నందమూరి ఫ్యామిలీ పొగడడమంటే టీడీపీ క్యాడర్ కి అది ఊహించలేని విషయంగానే ఉంటునిద్. కానీ ఏకంగాఎన్టీఆర్‌ కొడుకు బాలయ్య వైఎస్సార్ ని పొగిడారు. మరి ఇపుడు ఏమంటారు తమ్ముళ్ళూ అని అంతా అడుగుతునారు. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ అయితే తమ్ముళ్ళు ఇపుడు ఏమి జవాబు చెబుతారని అడుగుతున్నారు. అబ్బాయి చేస్తే తప్పు అన్న వారు బాధ్యత గల ఎమ్మెల్యే బాబాయ్ డైరెక్ట్ గా పొగగడాన్ని ఎలా అర్ధం చేసుకుంటారు అని నిగ్గదీస్తున్నారు.

జూనియర్ ని ఏకి పారేసే లెవెల్ లో బాలయ్యను కూడా వేసుకుంటారా. ఆయన మీద కూడా ట్రోల్స్ చేస్తారా అని అడుగుతున్నారు. రాజకీయాల్లో ఒక విధంగా అంటూ ఉంటే ఎవరినీ పక్కన పెట్టడం స్పేర్ చేయడం జరగదు. కానీ బాలయ్య కామెంట్స్ మీద మౌనగా ఉంటే మాత్రం టీడీపీలో ఒక సెక్షన్ జూనియర్ ని గట్టిగా వ్యతిరేకిస్తూనే ఈ రకంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయించింది అనే అర్ధం చేసుకోవాలని అంటున్నారు. చూడాలి మరి ఇది ఇక్కడితో ఆగిపోదు, పూర్తి స్థాయి ఎపిసోడ్ ప్రచారం అయ్యాక కచ్చితంగా దీని మీద రచ్చ ఉండడం ఖాయమని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.