Begin typing your search above and press return to search.

ఈ ద‌ఫా బాల‌య్య కోటా సీట్లెన్నో?

By:  Tupaki Desk   |   28 Feb 2019 1:30 AM GMT
ఈ ద‌ఫా బాల‌య్య కోటా సీట్లెన్నో?
X
నిజ‌మే... ఏపీ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చేశాయి. వ‌చ్చే నెల ప్ర‌థ‌మార్థంలో నోటిఫికేష‌న్ రానుండ‌గా - మార్చి చివ‌ర‌లో పోలింగ్ - ఏప్రిల్ ప్ర‌థ‌మార్ధంలో కౌంటింగ్ - ఫ‌లితాలు ఇచా అన్ని చ‌క‌చ‌కా జ‌రిగిపోయేందుకు రంగం సిద్ధ‌మైపోయింది. ఈ క్ర‌మంలో అన్ని రాజ‌కీయ పార్టీలు కూడా ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. అంద‌రి మాదిరే ఏపీలో అధికార పార్టీ టీడీపీ కూడా త‌న అభ్య‌ర్థుల విష‌యంలో తీవ్రంగానే క‌స‌ర‌త్తులు చేస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా... పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడి కుమారుడిగా గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష బ‌రిలోకి దిగిన నంద‌మూరి బాల‌కృష్ణ అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు త‌న‌తో పాటు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి సీటును క‌దిరి బాబూరావుకు ఇప్పించుకున్న బాల‌య్య‌... త‌న కోటాను నాడు రెండు సీట్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశారు.

అయితే ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య‌... చాలా వివాదాల‌నే కొని తెచ్చుకున్నారు. ఆ వివాదాల నేప‌థ్యంలో ఈ ద‌ఫా ఆయ‌న‌కు కూడా టికెట్ క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఎంతైనా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడికి కుమారుడు - పార్టీ ప్ర‌స్తుత అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి బావ‌మ‌రిది - వియ్యంకుడు కూడా అయిన బాల‌య్య‌... టికెట్ ఇవ్వ‌కుంటే ఊరుకుంటారా? తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వ‌కుంటే సైలెంట్‌ గానే ఉంటారా? అంటే... బాల‌య్య మ‌న‌స్తత్వం తెలిసిన వారెవ్వరూ స‌సేమిరా అనే అంటారు. బాల‌య్య కోరిన మేర‌కు సూచించిన అభ్య‌ర్థుల‌కు టికెట్లు ఇవ్వ‌డం త‌ప్పించి చంద్ర‌బాబుకు మ‌రో మార్గం లేద‌న్న వాద‌న కూడా అప్పుడ‌ప్పుడు వినిపించినా... బాల‌య్య స‌త్తా ఏమిటో తెలిసిన చంద్ర‌బాబు... త‌న‌దైన మంత్రాంగం నెర‌పుతార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

స‌రే... ఈ గోల అంతా ప‌క్క‌న‌పెడితే... బాల‌య్య కోటాలో ఈ ద‌ఫా ఎన్ని సీట్లు ఉంటాయ‌న్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య‌కు ఈ సారి కూడా హిందూపురం టికెట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు. అనంత‌పురం జిల్లా స‌మీక్ష‌లో భాగంగా చంద్ర‌బాబు ఈ మేర‌కు బాల‌య్య‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌న్న వార్త‌లు ఇందుకు నిద‌ర్శ‌నం. ఇక బాల‌య్య పెద్ద‌ల్లుడి హోదాలో చంద్రబాబు కుమారుడు - టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రి నారా లోకేశ్ కు కూడా ఈ ద‌ఫా ఎమ్మెల్యే టికెట్ ఖాయ‌మే. లోకేశ్ వ‌ద్ద‌న్నా కూడా పార్టీ ఆయ‌న‌ను బ‌రిలోకి దింప‌డం గ్యారెంటీనే. ఇక్క‌డితో బాల‌య్య కోటా రెండుకు చేరుకున్న‌ట్టే క‌దా. ఇక బాల‌య్య చిన్న‌ల్లుడి హోదాలో దివంగ‌త నేత ఎంవీవీఎస్ మూర్తి మ‌న‌వ‌డు భ‌ర‌త్ కూడా ఈ ద‌ఫా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని బ‌లంగానే నిర్ణ‌యించుకున్నారు. తాత స్థానంలో త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం త‌ప్ప‌నిస‌రి అన్న భావ‌న‌లో ఆయ‌న ఉన్నారు. విశాఖ ఎంపీ సీటు నుంచి బ‌రిలోకి దిగుతానంటూ కూడా ఆయ‌న ఇటీవ‌లే చెప్పారు. చిన్న‌ల్లుడి కోరిక తీర్చ‌డం మామ‌గా బాల‌య్య‌కు అత్యంత ప్రాధాన్య‌మే క‌దా. విశాఖ‌లో పెద్ద‌గా పోటీ లేదు కాబ‌ట్టి... పార్టీ టికెట్ ను భ‌ర‌త్‌ కు వ‌చ్చేందుకు చంద్రబాబుకు కూడా ఇబ్బందేమీ లేద‌నే చెప్పాలి. సో... ఇక్క‌డితో బాల‌య్య కోటా మూడుకు చేరిన‌ట్టే.

ఇక ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న క‌దిరి బాబూరావుకు టికెట్ ఇప్పించే బాధ్య‌త కూడా బాల‌య్యదే క‌దా. అయితే అనూహ్యంగా ఇప్పుడు అక్క‌డ ప‌రిస్థితులు మారిపోయాయి. కొత్త‌గా వ‌చ్చి చేరుతున్న ఉగ్రన‌ర‌సింహారెడ్డికి ప్రాధాన్యం ఇవ్వాల‌న్న లెక్క‌ల్లో చంద్రబాబు ఉన్నారు. అయితే సిట్టింగ్ గా ఉన్న త‌న‌ను ఎలా ప‌క్క‌న‌పెడ‌తారంటూ బాబూరావు... చంద్ర‌బాబును ముఖం మీదే అడిగేశారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయ‌తీ మాదిరిగా ఇద్ద‌రూ పార్టీలో ఉండాల్సిందేన‌ని - ఒకరికి ఎమ్మెల్యే టికెట్‌ - మ‌రొక‌రికి ఎమ్మెల్సీ సీటు ఇస్తానని చెప్పిన బాబు... ఏది ఎవ‌రికి కావాలో మీరే తేల్చుకోండి అంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పార‌ట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ రాద‌న్న భావ‌న‌తో నేరుగా బాల‌య్య వ‌ద్ద‌కు వెళ్లిన బాబూరావు.. త‌న పంతం నెగ్గించుకున్నారు. ఇప్పుడు కూడా త‌న‌కు టికెట్ రాద‌ని తేలితే... ఆయ‌న మ‌రోమారు బాల‌య్య‌ను ఆశ్ర‌యిస్తార‌న్న వాద‌న వినిపిస్తోంది. బాబూరావుకు కూడా టికెట్ ఇప్పించుకోగ‌లిగితే... బాల‌య్య కోటా ఈ సారికి నాలుగుకు చేరుతుంద‌న్న మాట‌. అలా కాకుండా బాబూరావుకు చంద్ర‌బాబు హ్యాండిస్తే మాత్రం బాల‌య్య కోటా మూడు వ‌ద్దే ఆగుతుంద‌న్న మాట‌. చూద్దాం... బాల‌య్య ఏ మేర చ‌క్రం తిప్పుతారో?