Begin typing your search above and press return to search.
దిశా ఎన్ కౌంటర్ పై NBK స్పందన
By: Tupaki Desk | 6 Dec 2019 7:15 AM GMTదిశా ఘటన లో నిందితుల ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సినీపరిశ్రమల నుంచి స్పందన అసాధారణంగా ఉంది. హీరోలంతా ముక్త కంఠంతో ఈ చర్యను ప్రశంసించారు. ఇంతకుముందు ఎన్టీఆర్ సహా మంచు మంచు మనోజ్.. నేచురల్ స్టార్ నాని స్పందించారు. దర్శకుడు హరీష్ శంకర్ తన బాణి వినిపించారు.
నిందితులను ఎన్‌కౌంటర్ చేసేందుకు పోలీసులు ఉపయోగించిన ఆ బుల్లెట్ల ను దాచుకోవాలని ఉందని.. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉందని మంచు మనోజ్ అన్నారు. ఎన్‌కౌంటర్ చేసిన ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉందని అన్నారు. నలుగురు చచ్చారనే వార్త లో ఇంత కిక్కు ఉందా? అంటూ మనోజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రోజే నీ ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా అని మనోజ్ ట్వీట్ చేశాడు. ఇటీవల మనోజ్ దిశ కుటుంబ సభ్యుల్ని కలిసి ఓదార్చిన సంగతి తెలిసిందే. ఇక తాజా ఎన్ కౌంటర్ పై నాని స్పందించారు. ``ఊర్లో ఒక్కడే రౌడీ ఉండాలి. ఆ రౌడీ పోలీసై ఉండాలి`` అంటూ నాని ట్విట్ చేశారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ- ``దేవుడే పోలీసుల రూపంలో దిశ నిందితులను శిక్షించాడు. దిశ ఆత్మ కు ఇప్పుడు శాంతి చేకూరింది`` అని అన్నారు. పోలీసులకు.. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పోలీసుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని అందుకు ఈ ఎన్ కౌంటర్ ఓ చక్కని ఉదాహరణ అని బోయపాటి అన్నారు. నేడు ఎన్.బీ.కే 106 చిత్రం హైదరాబాద్ లో లాంచనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నారు.