Begin typing your search above and press return to search.
సోదరి మృతితో బాధలో ఉన్న బాలయ్యను సెల్ఫీ అడిగిన ఫ్యాన్.. షాకింగ్ రియాక్షన్
By: Tupaki Desk | 3 Aug 2022 1:51 PM GMTనందమూరి ఇంట విషాదం అలుముకుంది. సీనియర్ ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమామహేశ్వరి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేసింది. ఇక సోదరి మృతి పట్ల నందమూరి బాలయ్య కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. స్వయంగా ఆమె పాడె మోశారు. సోదరి అంత్యక్రియలు ముగిసేవరకూ అన్నీ తానై వ్యవహరించారు.
సోదరి ఆఖరి చూపు చూసుకోవడానికి బాలయ్య తాజాగా స్వగృహానికి వెళ్లగా.. అక్కడ ఒక చేదు అనుభవం ఎదురైంది. ఒక అభిమాని హఠాత్తుగా వచ్చి సెల్ఫీ అడిగేసరికి బాలయ్య ఊహించని రియాక్షన్ ఇచ్చాడు.
కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసారా’ సినిమా విడుదలకు రెడీ అయిన వేళ ఉమామహేశ్వరి మరణం వారి ఇంట విషాదం నింపింది. నందమూరి హీరోలను మూగబోయేలా చేసినట్టైంది. ఉమా మహేశ్వరి మృతిపట్ల నందమూరి హీరోలంతా కన్నీటి పర్యంతమయ్యారు.
నందమూరి బాలయ్య తాజాగా ఉమామహేశ్వరికి ప్రతీ విషయంలో కూడా అండగానే ఉన్నారు. ఇటీవల మేనకోడలు పెళ్లిలో కూడా ఆయనే ఎంతో హడావుడిగా కనిపించినట్లు సమాచారం.అంత క్లోజ్ గా ఉండే సమయంలో చెల్లి ఉమామహేశ్వరి ఈ విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని బాలయ్య జీర్ణించుకోలేకపోయారు. సోదరి ఆఖరి చూపుల సమయంలో ఆయన కంటతడిపెట్టుకున్నారు. చెల్లి పాడెమోసి ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు.
సోదరి మృతితో తీవ్ర మనోవేధనలో ఉన్న బాలయ్య ఉమామహేశ్వరి ఇంటి ముందు మీడియా ఉన్నప్పటికీ పెద్దగా మాట్లాడలేదు. రియాక్షన్స్ కూడా ఇవ్వలేదు. ఇంతలో హఠాత్తుగాఒక అభిమాని వచ్చి ప్రవర్తించిన తీరుకు బాలయ్యకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. హఠాత్తుగా జనాల్లో నుంచి వచ్చి ఒక సెల్ఫీ కావాలని అడిగిన తీరు చూసి బాలయ్య ఆశ్చర్యపోయాడు.
బాలయ్య దుఖంతో వచ్చి కారు ఎక్కుతుండగా.. జనంలో ఉన్న ఒక అభిమాని సెల్ఫీ అడగగానే నందమూరి బాలయ్య ఏమీ అడగలేకపోయాడు. ఒక సెకండ్ అలా సైలెంట్ గా చూసి కారు ఎక్కి వెళ్లిపోయాడు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆ విధంగా సెల్ఫీ అడగడం కరెక్ట్ కాదు అని.. కొన్ని సార్లు అభిమానులు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా అర్థం కావడం లేదని.. మరికొందరు అభిప్రాయపడ్డారు.