Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు అందుకే టీడీపీ అప్పజెప్పాం..: బాలయ్య షాకింగ్ కామెంట్స్
By: Tupaki Desk | 5 Nov 2021 5:44 AM GMTఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతున్న నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక ఇమేజ్ ఉంది. సినిమాల్లో ఆయన చెప్పే డైలాగ్ లు.. రాజకీయ నాయకుడిగా ఆయన చేసే ప్రసంగాలు పలువురిని ఆకట్టుకుంటాయి. నందమూరి ఎన్టీరామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి.. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు బాలయ్య. అయితే తెలుగుదేశం పార్టీకి మాత్రం అధ్యక్షుడు కాలేకపోయారు. బాలకృష్ణే కాదు. ఎన్టీఆర్ కుమారుల్లో ఎవరూ టీడీపీ పగ్గాలు చేపట్టలేదు. ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు పార్టీని నడిపిస్తున్నారు. అయితే ఇటీవల బాలకృష్ణ ‘ఆహా’ హోస్టుగా కనిపించాడు. దానికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో బాలకృష్ణతో పాటు ప్రముఖ నటుడు మోహన్ బాబు కూడా పాల్గొన్నాడు. ఇద్దరు కలిసి ఒకరిపై ఒకరు ప్రశ్నలు వేసుకోగా బాలకృష్ణ టీడీపీ పగ్గాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాల్లో బాలకృష్ణది ప్రత్యేక నటన. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే బాలయ్య నటన ఉంటుంది. ఆయన చెప్పే భారీ డైలాగ్స్ మరే హీరోకు సెట్ కావన్నది ఇండస్ట్రీలో బాలయ్య ఫ్యాన్స్ టాక్. అయితే బాలయ్య ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. ఇంటర్వ్యూలు, టీవీ షోల అంటే అస్సలు గిట్టని బాలయ్య ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తున్నారు. ఇక్కడ కనిపించడమే కాకుండా ప్రేక్షకులు ఆశ్చర్యపోయే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో కొందరు టీవీ నిర్వాహాకులు బాలయ్యను తమ ఛానెళ్లో చూపించేందుకు తెగ ఆరాటపడిపోతున్నారు. ఈ క్రమంలో ‘ఆహా’ బాలయ్యను హోస్టుగా నియమించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పటి తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు ఈ పార్టీని ఆవిర్భవించారు. తెలుగు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీ స్థాపించిన కొద్దిరోజుల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత వరుసగా అధికారంలో కొనసాగింది. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ వారసులు ఎవరూ లేకపోయారు. తన కుమారులు రాజకీయాలపై ఎక్కువగా ఆసక్తి చూపలేకపోయారు. తన కుమారుల్లో ఒకరైన హరికృష్ణ పార్టీ కోసం పనిచేసినా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేకపోయారు. దీంతో తన అల్లుడు చంద్రబాబునాయుడికి ఎన్టీఆర్ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు.
ఈక్రమంలో ఎన్టీఆర్ మరణించిన తరువాత పార్టీని చంద్రబాబు నడిపించారు. అయితే ఎన్టీఆర్ వారసులు ఎవరూ పార్టీపై ఇంట్రెస్టు పెట్టకపోవడంతోనే చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టినట్లు అనుకుంటారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల తరువాత టీడీపీ పలు సార్లు అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్టీఆర్ వారసులు పార్టీలో ఉండాలన్న ఉద్దేశంతో హరికృష్ణకు రాజ్యసభ ఎంపీని చేశారు. ఆ తరువాత ఆయన తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో భాగంగా రాజీనామా చేశారు. ఆ తరువాత బాలకృష్ణ సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ బాలయ్య గెలుపొంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
తాజాగా బాలకృష్టను ‘ఆహా’ కార్యక్రమంలో మోహన్ బాబు ఆసక్తికర ప్రశ్నవేశారు. మీరు టీడీపీ పగ్గాలు చేపట్టకపోవడానికి కారణమేంటని ప్రశ్నిస్తారు. దీనికి బాలయ్య ‘తెలుగుదేశం పార్టీ వారసత్వాలకు అతీతంగా ఉంటుంది. అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటూ వారసత్వ రాజకీయాలు నడిచాయి. దానికి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం చేస్తుంది. నాన్నగారు కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం. ఆ సమయంలో వారసత్వ రాజకీయాలు చేస్తే బాగుండదని నేను టీడీపీ పగ్గాలు తీసుకోలేదు. చంద్రబాబు కష్టపడేతత్వం ఉన్న మనిషి. గ్రామ, మండల స్థాయి రాజకీయాలను చూశారు. అందుకే టీడీపీ అధ్యక్షుడిగా ఆయనే కరెక్టు. ’ అని చెప్పారు.