Begin typing your search above and press return to search.

బాలయ్య చిన్నల్లుడు : ఎంపీ సీటు మీద కర్చీఫ్ వేస్తే...?

By:  Tupaki Desk   |   13 Jun 2022 9:31 AM GMT
బాలయ్య చిన్నల్లుడు : ఎంపీ సీటు మీద కర్చీఫ్ వేస్తే...?
X
తెలుగుదేశం పార్టీలో బాలయ్య చిన్నలుడుగానే ఆయన హవా చూపిస్తున్నారు. నిజానికి ఆయన విశాఖ మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి మనవడుగా కూడా ఉన్నారు. అదే హోదాలో అదే వారసత్వంతో గీతం విద్యా సంస్థలను చూసుకుంటున్నారు. . ఇదిలా ఉంటే అయితే రాజకీయాల్లో మాత్రం బాలయ్య అల్లుడు అంటే బాగా ఐడెంటిఫై అవుతున్నారు. ఆయనే భరత్. తెలుగుదేశం పార్టీలో చూసుకుంటే పెద్దల్లుడు లోకేష్ చక్రం తిప్పుతున్నారు. తోడల్లుడిగా భరత్ కూడా అంతే స్థాయిలో కధ నడపాలి

కానీ తెలుగుదేశం పార్టీకి తోడల్లుళ్ళు అచ్చిరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకనాటి తోడల్లుడే. తరువాత టీడీపీలో ఆయన ఏమీ కాకుండా అయిపోయారు. ఇపుడు భరత్ విషయం తీసుకుంటే తాను ఎక్కువగా ఎంపీ మక్కువ చూపించే విశాఖ సీటు విషయంలో కూడా టికెట్ తెచ్చుకునే పరిస్థితి మాత్రం లేదనే అంటున్నారు. ఆయన నిజానికి ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్ లో గళం విప్పాలని చూస్తున్నారు.

విద్యాధికుడు అయిన భరత్ కి ఎంపీ కావాలన్నదే బలమైన కోరిక. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం 2019 ఎన్నికల సమయంలోనే చివరి వరకూ నాన్చి విశాఖ ఎంపీ అభర్ధిగా ఖరారు చేసింది. అది కూడా బాలయ్య హై కమాండ్ మీద వత్తిడి తేవడం వల్లనే అలా జరిగింది అని అంటున్నారు. దాంతో భరత్ కి ఆనాడు టైమ్ పెద్దగా లేకపోవడంతో ఓడారు అన్నదీ ఉంది.

ఇక ఈసారి మాత్రం తనకు బాగా టైమ్ ఉందని భావించి భరత్ చాప కింద నీరులా ఇప్పటి నుంచే అన్నీ సర్దుకుని రెడీ విశాఖ ఎంపీ స్థానానికి పోటీకి రెడీ అని చెబుతున్నారు. యితే చంద్రబాబు మాత్రం భరత్ కి ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో లేరు అని తెలుస్తోంది. భరత్ ని భీమిలీ పంపించాలని చూస్తున్నారుట.

భీమిలీలో టీడీపీ గట్టిగానే ఉంది. కానీ సరైన అభ్యర్ధి అయితే లేరు అన్నది పార్టీ ఆలోచన. పైగా లోకల్ గా ఉన్న వారిలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు వారి విజయావకాశాలను అడ్డుకుంటారు అన్న ఆలోచనలతో జాగ్రత్తగా బయట నుంచి దిగుమతి చేయాలని టీడీపీ పెద్దలు చూస్తున్నారుట.

దాంతో భరత్ ని భీమిలీకి పంపించాలని ఆలోచన చేస్తోంది అంటున్నారు. భరత్ కి భీమిలీతో లింక్ ఏంటి అంటే ఆయన గీతం విద్యా సంస్థలు భీమిలీలోనే ఉన్నాయి. ఇక ఆయన కూడా భీమిలీలో చురుకుగా తరచుగా తిరుగుతూ వస్తున్నారు. అంతే కాదు అక్కడ లోకల్ క్యాడర్ తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇక విశాఖ ఎంపీగా ఆయన పోటీ చేస్తే భీమిలీలో ఎక్కువ ఓట్లే ఆయనకు పోల్ అయ్యాయి. దీంతో భరత్ కి భీమిలీ ఇచ్చేయాలని బాబు చూస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. భరత్ ఎంపీ కుర్చీ మీద మోజు వదిలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి.