Begin typing your search above and press return to search.
హిందూపురంలో విజయం - బాలయ్య సీరియస్
By: Tupaki Desk | 21 March 2019 4:45 AM GMTపోయినసారి అంటే అదో ఊపు. టీడీపీ వస్తే అభివృద్ధి జరుగుతుందని అందరూ టీడీపీకి ఓటేశారు. దీంతో.. చాలాచోట్ల టీడీపీ అభ్యర్థులు చాలా ఈజీగా గెలిచేశారు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. చాలా చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉంది. దీంతో.. తమ తమ నియోజకవర్గంలో గెలిచి పరువు నిలుపుకునేందుకు టీడీపీ అభ్యర్థులు నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇంతవరకు అవేవీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు బాలయ్య. అసలు ఎప్పుడు నామినేషన్ వెయ్యాలి - ప్రచారం ఎలా చెయ్యాలి అనే దానిపై ఇప్పటికవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అదీగాక.. రెండేళ్లనుంచి బాలయ్య పనితీరుపై హిందూపురంలో అసమ్మతి సెగలు ఎక్కువయ్యాయి. మంచినీటి సౌకర్యం కల్పించలేదని.. ప్రజలు తాగునీటి కోసం కష్టపడుతుంటే కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ లో ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారనే అపప్రదను మూటకట్టుకున్నారు బాలయ్య. దీంతో.. ఈసారి హిందూపురంలో బాలయ్య గెలుపు కష్టమనే వార్తలు కూడా వచ్చాయి.
అయితే బాలయ్య మాత్రం తన గెలుపుపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తున్న షూటింగ్ లు అన్నింటిని పక్కన పెట్టేశాడు. మరో రెండు రోజుల్లో హిందూపురంలో ప్రచారం మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పటికే ముహూర్తం కూడా చూసుకున్నాడు. ఇక లోకల్ గా ఎలాంటి అసమ్మతి రాకుండా అల్రెడీ లీడర్ లను సెట్ చేసేశాడు. అన్నింటికి మించి హిందూపురం టీడీపీకి కంచుకోట. అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఎవ్వరూ నిలబడినా గెలుపు గ్యారంటీ అనే నమ్మకం ఉంది. దీంతో.. తాను కూడా గెలవడం పక్కా అని అభిప్రాయ పడుతున్నాడు బాలయ్య. మరి బాలయ్య ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.