Begin typing your search above and press return to search.
బాలయ్య తాజా కామెడీకి సారేజహాసే అచ్చా వేదికయింది
By: Tupaki Desk | 4 Dec 2018 2:54 PM GMTసినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోమారు తన ప్రసంగం శైలితో వార్తల్లో నిలిచారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు, మహాకూటమి తరఫున బరిలో నిలిచిన వారిని గెలిపించేందుకు ఆయన ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి నందమూరు సుహాసిన తరపున రోడ్‌షో నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... పోలింగ్ కు సమయం లేదు మిత్రమా... కార్యకర్తలు, అభిమానులు... ప్రచారంలో చేయాలి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనదైన శైలి లో ప్రసంగించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సోమవారం గడ్డి అన్నారంలో నిర్వహించిన రోడ్‌షోలో బాలయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ ఆంధ్రాకు వస్తావా.. రా చూద్దాం అంటూ తొడకొట్టిన సంగతి తెలిసిందే చంద్రబాబు పై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సెటైర్లు వేస్తున్నారని, హైదరాబాద్‌లో చంద్రబాబు పేరులేకుండా చేయాలంటే.. హైటెక్ సిటీ లేకుండా చేయాలని, ఫ్లై ఓవర్లు తీసేయాలని మరోసారి సవాల్‌చేస్తూ.. అవన్నీ తీసేసే దమ్ముందా అని రెచ్చగొట్టేలా మాట్లాడారు. కేసీఆర్ ఓ బట్టేబాజ్ అని, సచివాలయానికి రాని ముఖ్యమంత్రి, నిరుద్యోగులను మోసం చేసిన సీఎం అంటూ భవిష్యత్తులో పిల్లలు పాఠాలు చదువుకుంటారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా, ప్రాజెక్టుల రీ డిజైన్ల తో డబ్బు ఎక్కడికి పోతుందో అర్థం కావడంలేదన్నారు. మద్యం అమ్మకాల్లో , లంచగొండి తనంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు హైదరాబాద్ ద్వారా ఆదాయం పెంచితే... కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.2 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్లారని విమర్శించారు. చాలా మంది ఇక తెలంగాణలో టీడీపీ ఉండదని అన్నారు... కానీ, పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తెలుగులో ప్రసంగం ప్రారంభించి, హిందీలో ప్రసంగం చేయాలని అనుకుని ప్రయత్నించాడు. సారేజహాసె అచ్చాను తనదైన శైలిలో పలికి నవ్వులపాలయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.