Begin typing your search above and press return to search.
పోలింగ్ సెంటర్ లో బాలయ్య ఓవర్ యాక్షన్
By: Tupaki Desk | 5 April 2019 2:22 PM GMTహిందూపురం ఎన్నికలు ఈసారి బాలయ్యకు అంతగా ఏం కలిసొస్తున్నట్లు కన్పించడం లేదు. ఏం చేసినా వివాదాస్పదం అవుతుంది. నిన్నటికి నిన్న అందర్ని బూతులు తిడుతూ టార్గెట్ అయ్యాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక ఖాళీ బిందెలతో హిందూపురం వాసులు నిరసన తెలిపేసరికి ఉన్న కాస్త పరువు కూడా పోయింది. ఇప్పుడు ఇవాళ హిందూపురం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ సృష్టించాడు.
ఎన్నికల విధులకు హాజరయ్యే వారికోసం అన్ని జిల్లాల్లో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే అనంతపురం జిల్లా హిందూపురంలో నిర్వహించారు. ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సెంటర్ కు వచ్చిన బాలయ్య.. అక్కడ హల్ చల్ సృష్టించారు. పోలింగ్ సెంటర్ లో ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా ఉద్యోగులతో ఫొటోలు దిగారు. బాలయ్యతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు.
బాలయ్యతోపాటు టీడీపీ కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ లోకి వచ్చినా కూడా పోలీసులు చూస్తూ ఉండిపోయరు తప్ప ఆపేందుకు ప్రయత్నించలేదు. దీంతో బాలయ్యపై హిందూపురం రిటర్నింగ్ అధికారి గుణభూషణ్ రెడ్డికి వైసీపీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుని స్వీకరించిన రిటర్నింగ్ అధికారి.. బాలయ్యకు నోటీసుల జారీ చేస్తామని చెప్పారు. మొత్తానికి రోజుకో వివాదంతో హిందూపురంలో హల్ చల్ సృష్టిస్తున్నారు బాలయ్య.