Begin typing your search above and press return to search.
హోదా రాకుంటే తీవ్ర పరిణామాలు! బాలయ్య?
By: Tupaki Desk | 25 Oct 2015 6:30 AM GMTప్రత్యేక హోదా వ్యవహారంలో కొత్త అంకం షురూ అయ్యిందా? ఇంతకాలం ప్రత్యేక హోదా గురించి పలువురు మాట్లాడటం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వియ్యంకుడు.. హిందూపురం ఎమ్మెల్యే.. సినీ నటులు బాలకృష్ణ వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.
అమరావతి శంకుస్థాపన సందర్భంగా దేశ ప్రధాని ఎదురుగా ఉన్నా.. ప్రత్యేక హోదా మాటను ప్రస్తావించటానికి సైతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడని సంగతి తెలిసిందే. అలాంటిది బాలయ్య తాజాగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూనే.. ఒకవేళ ప్రత్యేక హామీని తీర్చకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న వార్నింగ్ మాట నోటి వెంట రావటం గమనార్హం.
తాజాగా మీడియాతో మాట్లాడిన బాలయ్య.. ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. ప్రత్యేకహోదా ఇవ్వకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు.
విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల్ని దశల వారీగా కేంద్రం నెరవేరుస్తందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తూ.. అందులో భాగంగానే ప్రత్యేక హోదా కూడా వచ్చి తీరుందని చెబుతూనే.. తాజా వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. ప్రత్యేకం మీద ఎప్పుడూ ఇలా మాట్లాడని బాలయ్య.. ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడటం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.