Begin typing your search above and press return to search.
బాలకృష్ణను మూర్ఖుడు అనేశాడుగా!
By: Tupaki Desk | 5 April 2022 5:24 AM GMTహిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను బహిరంగంగా ఓ బీసీ సంఘం నాయకుడు మూర్ఖుడు అని విమర్శించడం సంచలనంగా మారింది. అది కూడా హిందూపురంలోనే కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. ఆ బీసీ నాయకుడిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అసలు ఈ నాయకుడు ఎవరు? బాలయ్య బాబును అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది?
ఏపీలో సోమవారం నుంచి కొత్త జిల్లాల పాలన మొదలైంది. 13గా ఉన్న జిల్లాలు ఇప్పుడు 26గా మారాయి. అయితే శ్రీ సత్యాసాయి జిల్లాకు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ టీడీపీతో సహా అఖిల పక్షం ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా అందించారు. కానీ ఫైనల్ నోటిఫికేషన్‌లో పుట్టపర్తినే జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై అఖిల పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సోమవారం అఖిల పక్షం నాయకులు నిరసనకు దిగారు. హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుబ చలపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోవడానికి ముగ్గురు మూర్ఖులు కారణమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ ముగ్గురు.. అధికార వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్, స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలకృష్ణను మూర్ఖుడు అనడంతో ఒక్కసారిగా పరిస్థితి రణరంగంగా మారింది. అక్కడే ఉన్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. బాలయ్య బాబును మూర్ఖుడు అంటావా? అంటూ చలపతి మీదకు దూసుకెళ్లారు.
అలా మాట్లాడడం తప్పని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కుప్పం ఎమ్మెల్యే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసినట్లు ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బావ కోరిక తీర్చిన జగన్.. బావమరిది బాలయ్య విన్నపాన్ని మాత్రం మన్నించలేదని ప్రజలు అనుకుంటున్నారు.